Vijay Deverakonda

Vijay Deverakonda: నాని రికార్డులని కొట్టలేకపోయిన విజయ్?

Vijay Deverakonda: కింగ్‌డమ్ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. టైర్ 2 సినిమాల్లో ఓపెనింగ్ డే కలెక్షన్స్‌లో సుమారు 31 కోట్ల రూపాయలతో మూడో స్థానంలో నిలిచింది. నాని నటించిన హిట్ 3, దసరా సినిమాలు మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. హిట్ 3 ఇప్పటికీ టైర్ 2 ఓపెనింగ్ రికార్డ్‌ను తన ఖాతాలో ఉంచుకుంది. సినీ వర్గాలు ఈ రికార్డ్‌ను నాని తదుపరి చిత్రం పారడైజ్ మాత్రమే బద్దలు కొట్టగలదని అంచనా వేస్తున్నాయి. అయితే కింగ్‌డమ్ ఈ స్థాయిలో కలెక్షన్స్ సాధించడం టైర్ 2 సినిమాలకు కొత్త ఊపిరి లభించినట్లే అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక నుంచి బాగా ఆడితే ఫుల్ రన్లో ఈ సినిమా టాప్ రికార్డులు క్రియేట్ చెయ్యొచ్చు. మరి ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *