Fire Accident: ఢిల్లీ నగరంలోని పితంపురా ప్రాంతంలో ఉన్న శ్రీ గురు గోవింద్ సింగ్ (జీజీఎస్) కాలేజ్ ఆఫ్ కామర్స్ లో గురువారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఫైర్ డిపార్ట్మెంట్ చెప్పిన సమాచారం ప్రకారం, మంటలు ఉదయం 9:40 గంటల ప్రాంతంలో మొదలయ్యాయి. కాలేజ్ కట్టడంలోని లైబ్రరీ మొదటి అంతస్తులో మంటలు చెలరేగి, కొద్ది సేపటికే రెండవ మరియు మూడవ అంతస్తులకు వ్యాపించాయి.
అగ్నిమాపక బృందం చురుగ్గా స్పందన – 11 ఫైర్ టెండర్లు రంగంలోకి
ఈ ప్రమాద స్థలానికి 11 అగ్నిమాపక యంత్రాలు దౌడుమీద వచ్చి మంటలను అదుపులోకి తెచ్చాయి. ప్రస్తుతం శీతలీకరణ చర్యలు కొనసాగుతున్నాయి. కాలేజీ భవనం కిటికీలనుండి గాఢమైన పొగ బయటకు వస్తున్న దృశ్యాలు స్థానికులను ఆందోళనకు గురిచేశాయి.
ఇది కూడా చదవండి: Fire Accident: హైదరాబాద్లో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న 10 మంది
ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు
సంభవించిన విపత్తు తీవ్రత దృష్ట్యా, గాయాలు లేదా ప్రాణనష్టం జరిగినట్లు ఇప్పటివరకు ఎటువంటి అధికారిక సమాచారం లేదు. కాలేజీలో ఉన్న విద్యార్థులు మరియు సిబ్బంది అత్యవసరంగా భవనాన్ని ఖాళీ చేసినట్టు తెలుస్తోంది.
అగ్నిప్రమాదానికి కారణమేంటి?
మంటలు ఎలా చెలరేగినయనే విషయంపై అధికారులు విచారణ చేపట్టారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

