Venky-Trivikram: టాలీవుడ్ మోస్ట్ లవబుల్ హీరో విక్టరీ వెంకటేష్ మరోసారి ఫామ్‌లోకి వచ్చాడు. ఇటీవలి రీజనల్ ఇండస్ట్రీ హిట్‌తో దూసుకెళ్తున్న వెంకీ మామ.. ఇప్పుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో జతకట్టబోతున్నాడని సమాచారం. ఈ ఎవర్గ్రీన్ కాంబో నుంచి మరో సూపర్ హిట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి ‘వస్తున్నాం’ చిత్రంతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన వెంకటేష్.. మళ్లీ వచ్చే సంక్రాంతికి త్రివిక్రమ్‌తో కలిసి బరిలో దిగే అవకాశం ఉందని టాక్.
‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ లాంటి కల్ట్ క్లాసిక్‌లతో తెలుగు ఆడియెన్స్ హృదయాలను గెలుచుకున్న త్రివిక్రమ్.. ఈసారి వెంకీతో మరో మ్యాజిక్ క్రియేట్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రం గురించి మరిన్ని ఆసక్తికర విశేషాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది. అయితే, ఈ కాంబో నుంచి అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. వీరిద్దరి కెమిస్ట్రీ మరోసారి బాక్సాఫీస్‌ను రికార్డులతో నింపుతుందా? ఇందులో నిజం ఎంతవరకు ఉందనేది తెలియాలంటే.. కొద్ది రోజులు ఆగాల్సిందే!