Chhaava: విక్కీ కౌశల్, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఛావా’(Chhaava) సినిమా బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకెళ్తోంది. ఇప్పుడీ చిత్రం తెలుగు ప్రేక్షకుల కోసం డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలకు సిద్ధమైంది. గీతా ఆర్ట్స్ సంస్థ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. మార్చి 7 నుంచి ‘ఛావా’ తెలుగు వెర్షన్‌ను విడుదల చేయనున్నట్లు గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రకటించింది.
ఈ చిత్రం మహానాయకుడు ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా రూపొందించబడింది. ఇందులో విక్కీ కౌశల్ శంభాజీ పాత్రలో, రష్మిక ఆయన భార్య యేసుబాయి పాత్రలో కనిపించనున్నారు. చిత్రంలో ఔరంగజేబు పాత్రను అక్షయ్ ఖన్నా పోషించారు. ఫిబ్రవరి 14న హిందీలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను పొందింది.
Also Read: Shah Rukh Khan: ‘మన్నత్’ నుంచి వెళ్లిపోతున్న షారుక్ ఫ్యామిలీ.. ఎందుకంటే..?
దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన ఈ చిత్రంలో నటించడం తనకు గొప్ప అనుభూతి కలిగించిందని విక్కీ కౌశల్ వెల్లడించారు. పోరాటయోధుడి పాత్రలో ఒదిగిపోవడం కోసం విక్కీ ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నట్లు టీమ్ చెప్పింది. ఒక కీలక యాక్షన్ సీక్వెన్స్‌లో రాత్రంతా ఆయన చేతులను తాళ్లతో కట్టేయాల్సి వచ్చిందని, ఆ తర్వాత నెలన్నరపాటు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చిందని చిత్రబృందం వెల్లడించింది.
ఇటీవల తెలుగు వెర్షన్‌లో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందిస్తారనే వార్తలు వచ్చాయి. అయితే, ఆ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని సమాచారం. ఈ సినిమా వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన యుద్ధ వీరుడి గాధ. తెలుగు ప్రేక్షకులు వెండితెరపై శంభాజీ మహారాజ్ వీర చరిత్రను ఆస్వాదించేందుకు సిద్ధంగా ఉండండి!