Vice President: ప్రస్తుతం ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో ఆ పదవికి ఎన్నికైన వ్యక్తి వేతనంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్నది. ఈ రోజు (సెప్టెంబర్ 9) ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతున్నది. ఎన్డీఏ పక్షాన రాధాకృష్ణన్, ఇండియా పక్షాన సుదర్శన్‌రెడ్డి ఉపరాష్ట్రపతి అభ్యర్థులుగా పోటీపడుతున్నారు. వీరిద్దరిలో ఎన్డీయే అభ్యర్థికే గెలుపు అవకాశాలు ఉన్నాయని అంచనా.
Vice President: అయితే గత కొన్నాళ్లుగా ఉపరాష్ట్రపతి ఎన్నికపై జరుగుతున్న ప్రచారంపై దేశవ్యాప్తంగా పలువురు నెటిజన్లు వేతనంపై సెర్చ్ చేసినట్టు తెలుస్తున్నది. అసలు ఆ పదవికి వేతనం అసలే ఉండదనే విషయం తెలిసింది. ఇదే ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్‌గానూ వ్యవహరిస్తారు. ఆ పదవిలో మాత్రం వేతనం తీసుకుంటారు. ఉపరాష్ట్రపతిగా మాత్రం వేతనాలు ఉండవని తేలింది.
Vice President: శాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ ఆఫీసర్స్ ఆఫ్ పార్లమెంట్ యాక్ట్ 1953 ప్రకారం.. ఉపరాష్ట్రపతి వేతనానికి సంబంధించి ఎలాంటి నిబంధన లేదు. రాజ్యసభకు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నందున ఆయనకు వేతనం, ఇతర జీతభత్యాలు అందుతాయి.. అని స్పష్టంచేశారు. దేశంలో రెండో అత్యున్నత పదవే అయినా ప్రత్యక్షంగా జీతమంటూ లేకపోవడం గమనార్హం.
Vice President: రాజ్యసభ చైర్మన్‌గా నెలకు రూ.4 లక్షల చొప్పున ఏడాదికి రూ.48 లక్షల వేతనం పొందుతారు. ఉచిత నివాస సదుపాయం, వైద్య సేవలు, ప్రయాణ ఖర్చులు, ఫోన్లు, వ్యక్తిగత భద్రత, సిబ్బంది వంటి సదుపాయాలు కూడా ఉంటాయి. పదవీ విరమణ పొందిన ఉపరాష్ట్రపతికి నెలకు సుమారు రూ.2 లక్షల పింఛన్‌తోపాటు ఉచితంగా టైప్-8 బంగ్లా సౌకర్యం లభిస్తుంది. అయితే రెండేళ్లకు పైగా సేవలందించే వారికి ఆ పింఛన్ సదుపాయం ఉంటుంది.