Allam Gopalarao: ప్రముఖ సినీ, టీవీ నటులు అల్లం గోపాలరావు (75) ఈరోజు ఉదయం 8 గంటలకు అనారోగ్య కారణాలతో తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య విమల, కుమారులు అనిల్, సునీల్ ఉన్నారు. వారిలో పెద్ద కుమారుడు అనిల్ కూడా సీరియల్స్‌తో పాటు సినిమాల్లో నటిస్తున్నారు.
Also Read: KCR: ఏఐజీలో కేసీఆర్‌కు ముగిసిన వైద్యపరీక్షలు
Allam Gopalarao: గోపాలరావు గారి అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు మహాప్రస్థానంలో జరగనున్నాయి. ఆయన భౌతికకాయాన్ని సందర్శించి పలువురు సినీ ప్రముఖులు నివాళులర్పించారు. అలాగే ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ (FNCC) మేనేజ్‌మెంట్ కమిటీ గోపాలరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసింది.

