Venkatesh: విక్టరీ వెంకటేశ్ కు అవార్డులతో పాటు ప్రేక్షకుల రివార్డు కూడా దక్కిన చిత్రం ‘కలిసుందాం రా’. విశేషం ఏమంటే ఈ సినిమా 2000 సంవత్సరం జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదలైంది. ఈ చిత్రానికి గానూ వెంకటేశ్ ఉత్తమ నటుడిగా నంది అవార్డును అందుకున్నాడు. మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత వెంకటేశ్ ఆ స్థాయి విజయాన్ని మరోసారి సంక్రాంతికి, అదీ జనవరి 14న అందుకున్నాడు. అదే ‘సంక్రాంతికి వస్తున్నాం’. వెంకటేశ్ కెరీర్ లోనూ బెస్ట్ ఓపెనింగ్స్ ను ఈ సినిమా సాధించింది. మొదటి రోజున వరల్డ్ వైడ్ ఈ చిత్రం రూ. 45 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఈ సందర్భంగా రెండు చిత్రాలోని సన్నివేశాలను జత చేస్తూ సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఓ వీడియోను విడుదల చేసింది.