Sivakarthikeyan

Sivakarthikeyan: సంచలనం.. శివకార్తీకేయన్‌తో వెంకట్ ప్రభు కొత్త సినిమా!

Sivakarthikeyan: తమిళ చిత్రసీమలో వినూత్న కథలతో ఆకట్టుకునే దర్శకుడు వెంకట్ ప్రభు, ఇటీవల విజయ్‌తో ‘GOAT’ సినిమాతో విజయం సాధించారు. అయితే, కొంత విమర్శలు ఎదుర్కొన్న ఆయన, ఇప్పుడు శివకార్తీకేయన్‌తో కొత్త ప్రాజెక్ట్‌కు సిద్ధమయ్యారు. ఈ చిత్రాన్ని సత్య జ్యోతి ఫిల్మ్స్ నిర్మిస్తోంది. సంగీత దర్శకుడిగా యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు పనిచేస్తున్నారు. అక్టోబర్‌లో షూటింగ్ ప్రారంభం కానుంది. తారాగణం వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

Also Read: Disha Patani: సోషల్ మీడియాలో సెగలు పుట్టించిన దిశా పటానీ!

శివకార్తీకేయన్ ప్రస్తుతం ‘మదరాసి’ సినిమాతో సెప్టెంబర్ 5న, ‘పరాశక్తి’ చిత్రంతో 2026 పొంగల్‌కు ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ రెండు చిత్రాల తర్వాత, వెంకట్ ప్రభుతో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ కొత్త జోడీ ఎలాంటి కథతో ఆకట్టుకోనుందనే ఆసక్తి నెలకొంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *