vande bharat train

Vande Bharat Sleeper: వందేభారత్ స్లీపర్ ట్రైన్స్ వచ్చేస్తున్నాయి

Vande Bharat Sleeper: రైలు ప్రయాణికులకు శుభవార్త. భారతదేశంలో సుదూర ప్రయాణాన్ని సౌకర్యవంతమైనదిగా మార్చడానికి భారతీయ రైల్వే వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించేందుకు రెడీ అయిపొయింది. రాత్రి పూత రైలు ప్రయాణాల్లో వందేభారత్ వేగవంతమైన అత్యాధునిక సౌకర్యాలను అందిస్తుంది.  ఈ ట్రైన్స్ జనవరి 2025 నుండి ప్రారంభం కావచ్చని చెబుతున్నారు. 

ఇది కూడా చదవండి: Google: గూగుల్‌కి రష్యా బిగ్ షాక్.. కట్టలేనంత భారీ జరిమానా..

Vande Bharat Sleeper: BEML, రైల్ కోచ్ ఫ్యాక్టరీ (RCF) వందే భారత్ స్లీపర్ రైళ్లను తయారు చేస్తున్నాయి. వందే భారత్ స్లీపర్ రైలు ముందుగా  న్యూఢిల్లీ -శ్రీనగర్‌లను కలుపుతుంది. దేశ రాజధానిని జమ్మూ కాశ్మీర్‌కు అనుసంధానం చేయడం ద్వారా ఇది ఒక మైలురాయిని నిర్మిస్తుంది. ఈ రైలు సుమారు 800 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.  ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఇది దాదాపు 13 గంటల్లో ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది. అలాగే మొదటి దశలో  ఢిల్లీ-ముంబై మరియు ఢిల్లీ-చెన్నై రూట్లలో ఉండవచ్చని భావిస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Salman khan : 2 కోట్లు ఇవ్వకపోతే సల్మాన్ ఖాన్ చంపేస్తాం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *