Rashmika Mandanna

Rashmika Mandanna: ‘స్త్రీ2’ మేకర్స్ తో రశ్మిక హారర్ చిత్రం ‘ధామ’!

Rashmika Mandanna: ‘స్త్రీ2’తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన మడాక్ ఫిల్మ్స్ తదుపరి చిత్రంగా ‘థామ’ను రూపొందించనుంది. ఇందులో నేషనల్ క్రష్ రశ్మిక లీడ్ రోల్ పోషించనుంది. అతీంద్రియ శక్తులను బేస్ చేసుకుని సినిమాలు తీస్తూ వస్తున్న మడాక్ ఫిల్మ్స్, దినేష్‌ విజన్స్ ఈ విషయాన్ని గతంలో ‘‘స్త్రీ2’ ట్రైలర్ లాంఛ్ లోనే ప్రకటించింది. ఇక ఈ ప్రాజెక్ట్ లో రశ్మిక నటిస్తున్నట్లు స్పష్టం చేసింది దినేశ్ విజన్స్. రశ్మికకు జోడీగా ఆయుష్మాన్ ఖురానా నటించబోతున్నాడు. పరేశ్ రావెల్, నవాజుద్దీన్ సిద్ధిఖీ కీలక పాత్రలను పోషించే ఈ సినిమాకు ‘మంజై’ సీరీస్ కి పని చేసిన ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహించనున్నాడు. నిరేన్ భట్, సురేశ్ మ్యాథ్యూ, అరుణ్ ఫలారా స్క్రీన్ ప్లే సమకూరుస్తున్నారు. సచిన్-జిగర్ల సంగీతాన్ని అందించే ఈ మూవీని 2025 దీపావళికి రిలీజ్ చేస్తారట. ‘స్త్రీ’, ‘స్త్రీ2’తో శ్రద్ధా కపూర్ కి స్టార్ హీరోయిన్ ఇమేజ్ తెచ్చిపెట్టిన మడాక్ సంస్థ రశ్మికను కూడా బాలీవుడ్ లో బిజీ హీయిన్ ని చేస్తుందేమో చూడాలి.

ఇది కూడా చదవండి: Nayanthara: ‘బియాండ్ ది ఫెయిరీ టేల్’లో నయన్ ప్రేమాయణాలు ఉంటాయా..?

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Today Horoscope: ఈ రాశుల వారికి అనుకున్నవి అన్నీ జరిగే అవకాశం.. ఈరోజు రాశి ఫలాలు ఇలా..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *