Uttar pradesh: కుక్కకాటుపై ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకున్నది. ఒకసారి కరిచిన కుక్క మరోసారి కరిస్తే దాని నియంత్రణకు ఓ కట్టుదిట్టమైన నిర్ణయం తీసుకున్నది. ఓ మనిషికి జీవిత ఖైదు విధించినట్టుగానే, రెండోసారి కరిచిన కుక్కకు కూడా జీవిత ఖైదులాంటి కఠిన శిక్షను విధించాలని ఆ ప్రభుత్వం భావించింది. ఇది విచిత్రంగా అనిపించినా ఇటీవల పెరిగిన కుక్కల బెడదను నివారించేందుకు ఈ చర్య తీసుకున్నదని భావిస్తున్నారు.
Uttar pradesh: వీధి కుక్కలను నియంత్రించడానికి జంతు జనన నియంత్రణ కేంద్రాన్ని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్మించింది. మొదటిసారి మనిషిని కుక్క కరిస్తే ఆ కుక్కను 10 రోజులపాటు జంతు జనన నియంత్రణ కేంద్రంలో ఉంచి, టీకా వేసి, శరీరంలో మైక్రో చిప్‌ను అమర్చి విడుదల చేయనున్నారు. దానిని రెండోసారి కరిస్తే గుర్తించడానికి వీలు పడుతుందని తెలిపారు.
Uttar pradesh: రెండోసారి అదే కుక్క కరిస్తే దాన్ని అదే జంతు జనన నియంత్రణ కేంద్రంలో జీవితాంతం ఉంచేటట్టు ఏర్పాట్లు చేయనున్నారు. కుక్క కాటుపై పశుసంవర్ధక శాఖ అధికారులు, స్థానిక సంస్థల ప్రతినిధులు, ఎస్పీసీఏ సభ్యుల కమిటీ దర్యాప్తు చేసి, ఆ కుక్క రెండోసారి కరిచినట్టు పూర్తి ఆధారాలను సేకరిస్తేనే ఆ కుక్కకు జీవిత ఖైదు చేయాలని ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. ఇది వింతగా ఉన్నా, కుక్కల బెడద నివారణ కోసమే ఈ నిర్ణయం తీసుకుందని భావిస్తున్నారు.