Uttar Pradesh: ఘజియాబాద్‌లో ఘోర సంఘటన చోటుచేసుకుంది. బాలీవుడ్ నటి దిశా పటానీ ఇంటి ఎదుట జరిగిన కాల్పుల కేసులో నిందితులను వెంబడించిన పోలీసులు ఎన్‌కౌంటర్ నిర్వహించారు.
ఈ క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు నిందితులు అరుణ్, రవీంద్ర మృతి చెందారు. వీరు అంతర్జాతీయ గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ గ్యాంగ్‌కు చెందిన సభ్యులుగా పోలీసులు గుర్తించారు.
దిశా పటానీ నివాసం ఎదుట కాల్పులు జరగడంతో దేశవ్యాప్తంగా పెద్ద కలకలం రేగింది. నిందితులను పట్టుకునే క్రమంలో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి, వారిని మట్టుబెట్టారు.
ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తూ, గ్యాంగ్ ఇతర సభ్యులపై గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.