రిపబ్లికన్ పార్టీకి చెందిన డొనాల్డ్ ట్రంప్ – డెమోక్రటిక్ పార్టీకి చెందిన కమలా హారిస్ హోరాహోరీగా పోటీ చేస్తున్న ఈ రౌండ్ యుఎస్ అధ్యక్ష ఎన్నికలు మరోసారి చారిత్రాత్మక ఘట్టంగా నిలుస్తున్నాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. 2020 సంవత్సరంలో, బిడెన్ , ట్రంప్ ముఖాముఖి పోటీలో ఉన్నప్పుడు, కోవిడ్ -19 మహమ్మారి అతిపెద్ద సమస్య, కానీ ఈసారి ఎన్నికల సమస్యలు, వ్యూహాలు భిన్నంగా ఉన్నాయి, ఇది భారతదేశ లోక్‌సభ ఎన్నికల హడావిడి, సందడిని పోలినట్టుగా ఉండడం విశేషం. హోరాహోరీ ప్రసంగాలు.. వ్యక్తిత్వ హననాలు.. విమర్శలు.. మాటల యుద్ధం.. విచ్చలవిడి ఖర్చు.. అన్నీ యూఎస్ ఎన్నికల్లో ఈసారి మునుపెన్నడూ లేనివిధంగా కనిపించాయి.
ఇది కూడా చదవండి: Abdul Rahim Rather: జమ్మూకాశ్మీర్ స్పీకర్ గా అబ్దుల్ రహీమ్ రాథర్
US Election 2024:
అమెరికన్ పబ్లిక్ ఎన్నికల సమస్యలు
అమెరికా భిన్నత్వం కలిగిన దేశం. బయటి నుండి, ఈ దేశం వైట్ హౌస్, కాపిటల్ హిల్,న్యూయార్క్ ప్రసిద్ధ స్కైలైన్ రూపంలో కనిపిస్తుంది. కానీ, చాలా మంది అమెరికన్ ప్రజలు ఉపాధి, విద్య, ఆరోగ్యం, రుణమాఫీ వంటి వారి రోజువారీ సమస్యలకు ప్రాముఖ్యతనిస్తారు. చాలా మంది ఓటర్లు రిపబ్లికన్ లేదా డెమోక్రటిక్ పార్టీకి చెందిన నమోదిత ఓటర్లు. వారు సాధారణంగా తమ పార్టీకి విధేయులుగా ఉంటారు. అయితే, దీనికి భిన్నంగా కొన్ని స్వింగ్ స్టేట్స్ ఉన్నాయి. ఇక్కడ ఓటర్లు ఎన్నికల ఫలితాలను నిర్ణయిస్తారు. ఇక్కడ అబార్షన్, ఇమ్మిగ్రేషన్ వంటి సున్నితమైన సమస్యలు ప్రజలపై ప్రభావం చూపుతాయి.
అమెరికా ఎన్నికల వ్యవస్థ ఇలా ఉంటుంది.
- మొత్తం రాష్ట్రాలు- 50
- మొత్తం ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు-538
- మెజారిటీ- 270 లేదా అంతకంటే ఎక్కువ ఓట్లు
గత ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే, 2020లో డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌కు 306 ఎలక్టోరల్ ఓట్లు రాగా, రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు 232 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి.
ఇది కూడా చదవండి: US Elections 2024: అమెరికా ఎన్నికల్లో ఏనుగు-గాడిద.. అసలు కథ ఏమిటంటే..
అభ్యర్థుల వ్యూహం
అభ్యర్థులిద్దరూ ఒకరిపై ఒకరు వ్యక్తిగత, రాజకీయ దాడులు చేసుకుంటున్నారు. కమలా విజయంతో అమెరికాలో వలసదారులే ఆధిపత్యం చెలాయిస్తారని ట్రంప్ చెబుతుండగా, తమ అబార్షన్ హక్కులను ఉల్లంఘిస్తారనే భయాన్ని మహిళలకు చూపుతూ కమలా హారిస్ మద్దతు కూడగడుతున్నారు. అటువంటి పరిస్థితిలో, ఈ వివాదాస్పద అంశాలు ఓటర్లను ప్రలోభపెట్టడానికి ప్రధాన ఎన్నికల అస్త్రాలుగా మారాయి.
ప్రపంచంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?
నవంబర్ 5న జరిగే ఎన్నికల తర్వాత కమలా హారిస్ లేదా ట్రంప్ గెలిచినా.. ప్రపంచంపై అమెరికా విధానాల ప్రభావం అంతంత మాత్రమే. వారిద్దరికీ అంతిమంగా అమెరికా ప్రయోజనాలే ప్రధానమైనవి. ప్రపంచ అధినేతగా ఉండాలనేదే అమెరికా తాపత్రయం. దానికే ఎవరు గెలిచినా ప్రాధాన్యమిస్తారు. ట్రంప్ గెలిస్తే చైనా లేదా ఇరాన్ అమెరికాకు శత్రువుగా మారవచ్చు, హారిస్ అధ్యక్షురాలు అయితే, రష్యా సవాళ్లను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ ఎన్నికలు ప్రపంచ శాంతిలో మార్పు తీసుకురావు. కానీ ఘర్షణల వేదికలు మారవచ్చు అంతే. అమెరికా ఎన్నికల్లో ఎవరు గెలిచినా ప్రపంచంలో ఘర్షణ వాతావరణం మాత్రం అలానే ఉంటుంది.
భారత్ పై ప్రభావం ఎలా ఉండవచ్చు?
అమెరికా ఎన్నికలు మనదేశంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి అనే విషయానికి వస్తే అమెరికా తీసుకునే ప్రతి నిర్ణయం నేరుగా భారతదేశాన్ని ప్రభావితం చేయదు. అయితే ఈ ఎన్నికల ఫలితాల ద్వారా భారతదేశం-యుఎస్ సంబంధాలలో స్థిరత్వం, వ్యూహాత్మక భాగస్వామ్యం బలపడుతుంది. ఎవరు గెలిచినా, భారత్‌తో వాణిజ్యం, సైనిక భాగస్వామ్యాలు స్థిరమైన థీమ్‌గా ఉంటాయి, ముఖ్యంగా ఆసియాలో చైనా పెరుగుతున్న శక్తిని దృష్టిలో ఉంచుకుని అమెరికాలో ఎవరు అధికారంలోకి వచ్చినా పరిస్థితిలో పెద్దగా మార్పు ఉండదు. భారత్ విషయంలో ఎవరి వైఖరి అయినా దాదాపు ఒకేవిధంగా ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.


