Pemmasani Chandrasekhar

Pemmasani Chandrasekhar: కేంద్ర మంత్రి పెమ్మసాని రివ్యూ

Pemmasani Chandrasekhar: కేంద్ర ప్రభుత్వం సహకారంతో నిర్వహిస్తున్న హౌసింగ్ పథకంలో డూప్లికేట్ లబ్ధిదారులు లేకుండా చూసేందుకు ప్రధానమంత్రి తాజాగా రూపొందించిన ఆవాస్ అనే ఆండ్రాయిడ్ అప్లికేషన్ పై ఈరోజు గుంటూరు నగరంలో ఐదు రాష్ట్రాలలోని అధికారులకు అవగాహన కార్యక్రమంలో నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర గ్రామీణ అభివృద్ధి , కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, తజగ దేశవ్యాప్తంగా నమోదైన రెండు కోట్ల నూతన గృహాలకు సరైన దద్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేయటానికి ఈ అప్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. దీనితోపాటు పెండింగ్లో ఉన్న గృహాల నిర్మాణాన్ని త్వరగా పూర్తిచేయాలని కూడా అధికారులతో సమీక్షించామని మంత్రి తెలిపారు.

రాష్ట్ర గృహ నర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కోలుసు పార్థసారథి మాట్లాడుతూ రానున్న ఐదు సంవత్సరాలలో ప్రతి అర్హుడైన పేదవాడికి గృహాలను అందించటమే రాష్ట్ర ప్రభుత్వ రక్షమని తెలిపారు. 2014 నుండి 19 వరకు యూనిట్ కాస్ట్ రెండున్నర లక్షల ఉండగా గత వైసిపి ప్రభుత్వం దానిని 1.8 లక్షలకు తగ్గించిందని అందువల్ల రాష్ట్రంలో గృహ నిర్మాణం కొంటుపడిందని ఆయన ఆరోపించారు. కాలనీలలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తేనే లబ్ధిదారులు గృహ నిర్మాణాలకు ముందుకు వస్తారనే ఆలోచనతో ముందుగా మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టామని కొలుసు పార్థసారథి తెలిపారు. JJM, NREGS వంటి పథకాల ద్వారా జగనన్న కాలనీలను అభివృద్ధి చేస్తామని ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా వాటికి అప్రోచ్ రోడ్లు నిర్మిస్తామని మంత్రి తెలిపారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Bay Leaf Benefits: బిర్యాణి ఆకు తింటే షుగర్ కంట్రోల్, మరెన్నో ప్రయోజనాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *