TG News: దివారం (అక్టోబర్ 12) సరదాగా ఈత కొట్టాలనే వారి ఆలోచన ఇద్దరు యువకుల కొంప ముంచింది. రంగారెడ్డి జిల్లా, రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుద్వేల్లో హిమాయత్ సాగర్ బ్యాక్ వాటర్ అయిన మూసీ నదిలోకి ఈతకు దిగిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు.
వివరాల్లోకి వెళ్తే.. వారాంతపు సెలవుదినం కావడంతో కొంతమంది యువకులు బుద్వేల్ వద్ద ఉన్న మూసీ బ్యాక్ వాటర్లోకి దిగారు. అయితే, ఈత కొడుతున్న క్రమంలో ఇద్దరు యువకులు ఒక్కసారిగా కనిపించకుండా పోవడంతో, వారితో పాటు ఉన్న ఇతర వ్యక్తులు పోలీసులకు సమాచారం అందించారు.
ఇది కూడా చదవండి: Justin Trudeau Katy Perry: గర్ల్ ఫ్రెండ్ ప్రేమలో మునిగిపోయిన మాజీ ప్రధాని.. అందరిముందే ముద్దులతో రెచ్చిపోయాడు
ఎన్డీఆర్ఎఫ్ రంగంలోకి… ఆచూకీ లభ్యం కాలేదు:
సమాచారం అందుకున్న వెంటనే రాజేంద్రనగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గల్లంతైన యువకుల కోసం గజ ఈతగాళ్లు మరియు ఎన్డీఆర్ఎఫ్ (NDRF) బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. నదిలో తీవ్రంగా గాలించినప్పటికీ, చీకటి పడే వరకు వారి ఆచూకీ మాత్రం లభించలేదు.
కేవలం కొద్దిసేపు సరదాగా గడపాలని వచ్చి, ఈ దుర్ఘటనలో ఇద్దరు యువకులు గల్లంతు కావడంతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది. గల్లంతైన యువకుల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. గాలింపు చర్యలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.