Jaani master: ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. లేడీ కొరియోగ్రాఫర్ పై జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని పోలీసులు నిర్ధారించారు. ఈ విషయమై కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈవెంట్ల పేరుతో పలు ప్రాంతాలకు తీసుకెళ్లి ఆమెపై లైంగిక వేధింపులు చేశాడని ఛార్జ్ షీట్‌లో పేర్కొన్నారు.
లేడీ కొరియోగ్రాఫర్ సెప్టెంబర్ 15న నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేస్తూ, జానీ మాస్టర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని పేర్కొన్నారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు జానీ మాస్టర్‌పై కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఆయనను అరెస్ట్ చేశారు. అయితే, కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో అక్టోబర్ 25న చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యారు.
ఈ కేసు కారణంగా జానీ మాస్టర్ నేషనల్ అవార్డును కోల్పోయిన సంగతి తెలిసిందే.