Telangana: తెలంగాణ రాష్ట్ర పోలీస్ బాస్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర డీజీపీగా ఉన్న శివధర్ రెడ్డి ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన రిటైర్మెంట్ తర్వాత, మే మొదటి వారంలో సీవీ ఆనంద్ కొత్త డీజీపీగా బాధ్యతలు స్వీకరించే ఛాన్స్ ఉందని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది.
సీవీ ఆనంద్‌కు పోలీస్ శాఖలో మంచి పట్టు ఉంది. ఆయన ప్రస్తుతం హోం శాఖలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే, తాజాగా జరిగిన ఐపీఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా ఆయన స్థానంలో శిఖా గోయల్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మార్పులన్నీ చూస్తుంటే, ఆనంద్‌ను త్వరలోనే రాష్ట్ర పోలీస్ శాఖకు అత్యున్నత అధికారిగా నియమించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్లు కనిపిస్తోంది.
సాధారణంగా డీజీపీ వంటి కీలక పదవుల నియామకంపై ప్రభుత్వం ఆచితూచి నిర్ణయం తీసుకుంటుంది. సీవీ ఆనంద్‌కు ఉన్న అనుభవం, సమర్థత దృష్ట్యా ఆయన పేరు దాదాపు ఖరారైనట్లేనని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వెలువడితే, మే మొదటి వారం నుంచి తెలంగాణ పోలీస్ వ్యవస్థలో కొత్త మార్పులు వచ్చే అవకాశం ఉంది.
