Mahaa Chairman

మీడియా ప్రతినిధిగా కాదు.. రెండేళ్ల క్రితమే చంద్రబాబు హామీ.. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు

రైతు కుటుంబంలో పుట్టి.. ప్రభుత్వ ఉద్యోగిగా హైదరాబాద్ చేరి.. వ్యాపారవేత్తగా మారి.. మీడియా ప్రతినిధిగా ఎదిగి.. తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ గా శ్రీవారి భక్తులకు సేవ చేస్తుకుని అపూర్వ అవకాశం అందుకున్న బీఆర్ నాయుడు..  మహా న్యూస్ ఛైర్మన్ మారెళ్ల వంశీకృష్ణతో ప్రత్యేకంగా ముచ్చటించారు. తన జీవిత ప్రస్థానం.. శ్రీవారి భక్తునిగా తన అనుభవాలు.. రాజకీయంగా తన స్టాండ్.. టీటీడీ ఛైర్మన్ గా వేంకటేశుని దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి సౌకర్యాన్ని కల్పించాలి.. ప్రశాంతంగా దేవదేవుని దర్శనం చేసుకుని  భక్తులు ఆనందపరవశులు కావడానికి ఎటువంటి ఏర్పాట్లు చేయాలనీ అనుకుంటున్నారు.. ఇలా తన మనసులోని భావాలను మహా న్యూస్ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో మహా వంశీతో పంచుకున్నారు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు. 

తనకు మీడియా ప్రతినిధిగా ఈ అద్భుత అవకాశం రాలేదనీ.. తెలుగుదేశం పార్టీతో దశాబ్దాలుగా ఉన్న అనుంబంధం.. పార్టీకోసం చేసిన సేవలకు గుర్తింపుగానే ఈ అపూర్వ అవకాశం ఇచ్చారని బీఆర్ నాయుడు వెల్లడించారు. తానూ ఎన్టీఆర్ అభిమాని అని చెప్పారు. ఎప్పుడో 1971లోనే తాను ఎన్టీఆర్ అభిమాన సంఘాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అప్పటి నుంచి ఎన్టీఆర్ అభిమానిగా ఆయన రాజకీయాల్లోకి వచ్చాకా తెలుగుదేశం పార్టీతోనూ తన ప్రయాణం కొనసాగిందన్నారు. ఎన్టీఆర్ ను పదవీచ్యుతుని చేసిన సమయంలో నిరసనలు తెలిపినందుకు తనను పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పారు. ఆ తరువాత చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాకా కూడా తెలుగుదేశం పార్టీతో తన అనుబంధం కొనసాగుతూనే ఉందని బీఆర్ నాయుడు వెల్లడించారు. తాను 1983లోనే చిత్తూరు ఎమ్మెల్యే సీటు కావాలని ఎన్టీఆర్ ని అడిగానని చెప్పారు. చిత్తూరు నుంచి పుత్తూరు నుంచి పోటీచేయాలని తనకు చెప్పారన్నారు. దీంతో తాను పోటీనుంచి విరమించుకున్నానని తెలిపారు. 

రెండేళ్ల క్రితం తనకు టీటీడీ ఛైర్మన్ పదవి ఇస్తానని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని తెలిపారు బీఆర్ నాయుడు. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ మాట నిలబెట్టుకున్నారన్నారు. టీటీడీ ఛైర్మన్ గా తన ప్రధాన బాధ్యత శ్రీవారి దర్శనం కోసం వచ్చిన ప్రతి భక్తుడు సంతృప్తిగా దర్శనం చేసుకుని.. మనసు నిండా స్వామివారిని నింపుకుని సంతోషంగా ఇంటికి చేరాలన్నదే తన ధ్యేయం అని బీఆర్ నాయుడు చెప్పారు. 

మహా వంశీతో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూను పూర్తిగా ఈ క్రింది వీడియోలో చూడండి. 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  MAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *