Tirumala: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుభవార్తను ప్రకటించింది. జూన్ నెలలో నిర్వహించే వివిధ ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు, వసతి గదుల కోటా విడుదల తేదీలను వెల్లడించింది.
ఆర్జిత సేవల కోటా విడుదల వివరాలు:
✔ మార్చి 18:
శ్రీవారి సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదల పాదపద్మారాధన సేవల జూన్ నెల కోటాను విడుదల చేయనుంది. ఈ సేవలకు లక్కీ డిప్ ద్వారా టికెట్లు పొందే అవకాశం ఉంది. లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ మార్చి 18 నుండి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు జరుగుతుంది. విజేతలుగా ఎంపికైన భక్తులు మార్చి 20 నుంచి 22 మధ్యాహ్నం 12 గంటలలోగా టికెట్ ఫీజు చెల్లించాలి.
✔ మార్చి 21:
కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవల కోటా ఉదయం 10 గంటలకు విడుదల.
✔ మార్చి 21:
శ్రీవారి జ్యేష్టాభిషేకం ఉత్సవం (జూన్ 9 నుండి 11 వరకు) టికెట్లు ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రానున్నాయి.
✔ మార్చి 21:
వర్చువల్ సేవలు, దర్శన స్లాట్స్‌కు సంబంధించిన జూన్ నెల కోటా మధ్యాహ్నం 3 గంటలకు విడుదల.
✔ మార్చి 22:
అంగప్రదక్షిణం కోటా ఉదయం 10 గంటలకు విడుదల.
శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు ఉదయం 11 గంటలకు అందుబాటులోకి రానున్నాయి.
ప్రత్యేక దర్శన టోకెన్లు, వసతి గదుల కోటా:
✔ మార్చి 22:
వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న భక్తులకు ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్లు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల.
✔ మార్చి 24:
ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఉదయం 10 గంటలకు విడుదల.
✔ మార్చి 24:
తిరుమల, తిరుపతిలో వసతి గదుల కోటా మధ్యాహ్నం 3 గంటలకు విడుదల.
భక్తులు ఈ టికెట్లను టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.