Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబ్ పేల్చారు. 2025 అక్టోబర్ 1 నుండి దిగుమతి చేసుకునే బ్రాండెడ్, పేటెంట్ పొందిన ఫార్మాస్యూటికల్ డ్రగ్స్ పై 100% టారిఫ్‌ను విధిస్తున్నట్లు ప్రకటించారు. అయితే, ఈ టారిఫ్ అమెరికాలో తయారీ ప్లాంట్లను నిర్మిస్తున్న కంపెనీలకు వర్తించదని తెలిపారు. ట్రంప్ తన సోషల్ మీడియా పోస్ట్‌లో, “అక్టోబర్ 1 నుండి, ఏ కంపెనీ అయినా అమెరికాలో ఫార్మాస్యూటికల్ తయారీ ప్లాంట్‌ను నిర్మించనట్లయితే, వాటి బ్రాండెడ్ లేదా పేటెంట్ పొందిన ఫార్మాస్యూటికల్ ఉత్పత్తిపై 100% టారిఫ్‌ను విధిస్తాము” అని పేర్కొన్నారు.
Also Read: Pawan OG Oochakotha: సినిమా, పాలిటిక్స్.. పవన్ కళ్యాణ్‌కు ఏదీ ఊరికే రాలేదు!
ఈ నిర్ణయం వల్ల ముఖ్యంగా భారతీయ ఫార్మా రంగంపై గణనీయమైన ప్రభావం పడే అవకాశం ఉంది. అమెరికా భారతదేశపు ఫార్మా ఎగుమతులకు అతిపెద్ద మార్కెట్. భారతదేశం నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే మొత్తం ఫార్మా ఉత్పత్తులలో 31% వాటా ఉంది. ఈ చర్య వల్ల భారతీయ కంపెనీలు తమ వ్యాపారాలను అమెరికాలో కొనసాగించాలంటే అక్కడ తయారీ యూనిట్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇది భారతదేశంలోని ఔషధ కంపెనీలపై, ప్రత్యేకించి అమెరికా మార్కెట్‌పై ఎక్కువగా ఆధారపడిన వాటిపై ప్రభావం చూపుతుంది.