The Paradise Glimpse

The Paradise Glimpse: ‘ది ప్యారడైజ్’ గ్లింప్స్ పై ట్రోల్స్!

The Paradise Glimpse: నాని నటిస్తున్న ‘ది పారడైజ్’ నుంచి గ్లింప్స్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేయగా అది సోషల్ మీడియాని ఓ రేంజిలో ఊపేస్తుంది. ఇందులో నాని మాస్ లుక్‌లో డిఫరెంట్ క్యారెక్టర్‌లో కనిపిస్తున్నారు. మొత్తానికి ఈ గ్లింప్స్ అదిరిపోయింది. సినిమాపై ఆసక్తిని పెంచింది. అయితే, ఈ గ్లింప్స్ లో వాడిన పదజాలం గురించి నెట్టింట తీవ్రంగా చర్చ జరుగుతోంది.ఇందులో పెద్ద బూతు పదాన్ని, అది కూడా తల్లిని కించపరిచే పదాన్ని వాడటమేంటంటూ కొంతమంది విమర్శలు గుప్పిస్తుండగా, సినిమా కథ దృష్ట్యా ఈ పదం వాడి ఉండొచ్చని, మూవీ రిలీజయ్యే వరకూ విమర్శించడం సరికాదని నాని ఫ్యాన్స్ పోస్ట్ లు పెడుతున్నారు. పక్కా యాక్షన్ ఎలిమెంట్స్ తో రాబోతున్న ఈ సినిమా మాస్ కి ఫుల్ మీల్స్ లా ఉంటుందని తెలుస్తుంది. ఇక సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటించే హీరోయిన్ ని ఇంకా ప్రకటించలేదు. ఇక ఈ చిత్రానికి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం-రహస్య గోరఖ్ బాబు నామకరణం.. పేరు ఏంటంటే.?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *