Cricket: హెడేక్ తీసేసిన వరుణ్..

Cricket: ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ 39 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. చాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ట్రావిస్ హెడ్‌ను అవుట్ చేశాడు. భారీ షాట్‌కు ప్రయత్నించిన ట్రావిస్ హెడ్, లాంగ్ ఆఫ్‌లో గిల్‌కు క్యాచ్ ఇచ్చాడు.

ఇన్నింగ్స్ ఆరంభంలోనే కొన్ని శ్రమదాయకమైన షాట్లు ఆడిన ట్రావిస్, షమీ వేసిన ఐదో ఓవర్‌లో వరుసగా మూడు ఫోర్లు బాదాడు. మంచి ఫామ్‌లో కనిపించిన అతను భారీ స్కోర్ చేయనున్నాడనిపించినప్పటికీ, వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో వికెట్ కోల్పోయాడు. మొత్తం 33 బంతులు ఎదుర్కొన్న ట్రావిస్ హెడ్, ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 39 పరుగులు సాధించాడు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *