Trisha: త్రిష కెరీర్ కి లైఫ్ ఇచ్చిన చిత్రం ‘వర్షం’. అయితే ఆ సినిమాను మధ్యలోనే వదిలేద్దామనుకుందట త్రిషా. 45 రోజుల పాటు వర్షంలో షూటింగ్ చేసి జలుబు, జ్వరంతో తెగ ఇబ్బంది పడ్డానని, ఓ దశలో సినిమా మానేసి వెళ్ళాలనుకున్నానని ఓ షోలో చెప్పింది. తల్లితో కలసి ఓ షోలో పాల్గొన్న త్రిష ‘వర్షం’తన కెరీర్ లో స్పెషల్ చిత్రమని చెప్పారు. ఆ సినిమా ఘన విజయంతో త్రిషకు వెనుదిరిగి చూసుకునే అవకాశం కలగలేదు. ఆ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో బిజీ హీరోయిన్ గా టాప్ స్టార్స్ అందరితో నటించింది. అలా ‘వర్షం’తో బంపర్ హిట్ కొట్టిన త్రిష 20 ఏళ్ళ తర్వాత ఇప్పుడు కూడా స్టార్ హీరోయిన్ గానే కొనసాగుతుండటం విశేషం. ‘వర్షం’లో త్రిషకు జోడీగా నటించిన ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ కాగా త్రిష ఇప్పటికీ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం చిరంజీవి చిత్రం ‘విశ్వంభర’లో త్రిషనే హీరోయిన్. ‘స్టాలిన్’ తర్వాత చిరుతో త్రిష నటిస్తున్న చిత్రమిది. సంక్రాంతికి అజిత్ సినిమా ‘విడా ముయర్చి’ తోను, జనవరిలోనే మలయాళంలో టొవినో థామస్ చిత్రంతోనూ రానుంది. ‘విశ్వంభర’ వేసవిలో రిలీజ్ కానుంది. ఇవి కాకుండా అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’కూడా పూర్తయింది. కమల్, శింబుతో నటిస్తున్న ‘థగ్ లైఫ్’ పూర్తి కావచ్చింది. మరి ఇలా ఇంకెంత కాలం త్రిష ఆడియన్స్ ని అలరిస్తుందో చూడాలి.

