Bollywood: బాలీవుడ్ స్టార్ హీరోలు రణవీర్ సింగ్, రణబీర్ కపూర్ ఇద్దరూ స్టార్ హీరోయిన్లనే పెళ్లి చేసుకున్నారు. పెళ్ళికి ముందు ప్రేమాయణాల సంగతి ఎలా ఉన్నా… రణవీర్ సింగ్ దీపికాపదుకొనేను వివాహం చేసుకుంటే… రణబీర్ కపూర్… ఆలియా భట్ ను పెళ్ళి చేసుకున్నాడు. ఇద్దరూ తండ్రులు కూడా అయ్యారు. చిత్రం ఏమంటే… రణబీర్ కపూర్ కెరీర్ దేదీప్యమానంగా వెలిగిపోతోంది. మరీ ముఖ్యంగా ‘యానిమల్’ మూవీతో అతను గ్రాండ్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. అలానే ‘రామాయణ్’ మూవీతో పాటు సంజయ్ లీలా భన్సాలీ చిత్రం ‘లవ్ అండ్ వార్’లో నటిస్తున్నాడు. కానీ ఇటు రణవీర్ సింగ్ కెరీర్ డోల్ డ్రమ్స్ లో పడిందేమో అనిపిస్తోంది. సోలో హీరోగా ఆశించిన స్థాయి విజయం దక్కడం లేదు. పైగా ‘డాన్ -3’ మూవీ ఎప్పుడు పట్టాలు ఎక్కుతుందో తెలియకుండా ఉంది. షారుఖ్ ఖాన్ ను చూసిన కళ్ళతో రణవీర్ సింగ్ ను చూడలేమంటూ సోషల్ మీడియాలో కొందరు విమర్శలు చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే… రణబీర్ కపూర్ కెరీర్ అంత బ్రైట్ గా పాపం రణవీర్ సింగ్ కెరీర్ కానరావడం లేదు.