Trinadha Rao Nakkina: ఆదివారం ‘మజాకా’ టీజర్ లాంచ్ సమయంలో హీరోయిన్ అన్షుపై దర్శకుడు త్రినాథరావు నక్కిన చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. తెలంగాణ రాష్ట్ర మహిళా సంఘం ఛైర్మన్ నేరెళ్ళ శారద దీనిని సీరియస్ గా తీసుకున్నారు. మహిళలను వేదికపై నుండి కించపరిచిన త్రినాథ రావు నక్కినకు నోటీసులు పంపేందుకు రంగం సిద్థం చేశారు. అయితే జరిగిన పొరపాటును గుర్తించి త్రినాథ రావు నక్కిన దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టారు. సరదాగా తాను చేసిన వ్యాఖ్యలు ఇంత దుమారం లేపుతాయని భావించలేదని, హీరోయిన్ అన్షు తో పాటు తన వ్యాఖ్యల వల్ల బాధపడిన ప్రతి ఒక్కరికీ క్షమాపణలు చెబుతున్నట్టు త్రినాథరావు తెలిపారు. అలానే మరో హీరోయిన్ పేరు మర్చిపోయినట్టుగా సరదాగా చేసిన తన ప్రసంగం అగ్ర కథానాయకుడి అభిమానుల ఆగ్రహానికి గురిచేసిందని, అందుకు కూడా వారికి క్షమాపణలు చెబుతున్నానని త్రినాథరావు అన్నారు.

