శంషాబాద్ విమానాశ్రయానికి బాంబ్ బెదిరింపు కల్ వచ్చింది. కోయంబత్తూరు – చెన్నై వయా హైదరాబాద్ వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. బాంబు బెదిరింపు కాల్ తో ఫ్లైట్ లోని సిబ్బంది కలవరానికి గురయ్యారు. దాంతో హైదరాబాద్ లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాన్ని అత్యవసరంగా నిలిపివేశారు అధికారులు.
ఆరు గంటలు చెక్ చేసిన తర్వాత ఏమీ లేదని ఊపిరి పీల్చుకున్నారు.ప్రయాణ సమయంలో ఇండిగో విమానంలో 181 మంది ప్రయాణికులు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న అధికారులు విచారణ చేస్తున్నారు

