Suryapet: సూర్యాపేట జిల్లా పెద్దగట్టులో లింగమంతుల స్వామి జాతర ఘనంగా జరుగుతోంది. ఐదు రోజుల పాటు జరిగే ఈ జాతరలో సుమారు 25 లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా. ఈ సందర్భంగా భక్తుల రద్దీకి అనుగుణంగా పోలీసులు పలు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
ట్రాఫిక్ ఆంక్షలు:
హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే వాహనాలను నార్కెట్‌పల్లి, నల్గొండ, కోదాడ మార్గంగా మళ్లిస్తున్నారు.
విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే వాహనాలను కోదాడ, నల్గొండ, నార్కెట్‌పల్లి మార్గంగా మళ్లిస్తున్నారు.
ఈ ఆంక్షలు రెండు రోజుల పాటు అమల్లో ఉంటాయి.జాతరను సందర్శించే భక్తులు, ప్రయాణీకులు ముందస్తు ప్రణాళికతో తమ ప్రయాణాన్ని కొనసాగించుకోవాలి.

