Mirai: సినిమా రంగంలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. యువ కథానాయకుడు తేజ సజ్జా, ప్రముఖ నటుడు మనోజ్ మంచు, ప్రతిభావంతురాలైన నటి రితికా నాయక్ ప్రధాన పాత్రలలో రూపొందిన ‘మిరాయ్’ చిత్రం దేశవ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఈ సినిమా పంపిణీ కోసం భారతదేశంలోని దిగ్గజ నిర్మాణ సంస్థలు ఒకే తాటిపైకి వచ్చాయి.
అగ్ర నిర్మాణ సంస్థల కలయిక
“మిరాయ్” చిత్రం భారత సినీ చరిత్రలో ఒక సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. సాధారణంగా ఒక భాషలో ఒక సినిమాను ఒకే సంస్థ పంపిణీ చేస్తుంది. కానీ, ఈ సినిమా విషయంలో ఆ సంప్రదాయం మారింది. తెలుగుతో పాటు, దేశంలోని అగ్రశ్రేణి నిర్మాణ సంస్థలు ఈ చిత్ర పంపిణీలో భాగమయ్యాయి. బాలీవుడ్‌లో ప్రఖ్యాత సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ హిందీలో, “KGF” వంటి పెద్ద సినిమాలను నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ కన్నడలో, తమిళ సినీ రంగంలో పేరున్న బ్యానర్ ఏజీఎస్ సినిమాస్ తమిళంలో, శ్రీ గోకులం మూవీస్ మలయాళంలో ఈ సినిమాను ప్రేక్షకులకు అందించనున్నాయి. ఈ ప్రత్యేకమైన కలయికతో “మిరాయ్” చిత్రం దేశవ్యాప్తంగా భారీగా విడుదల కానుంది, ఇది సినిమాకు పాన్-ఇండియా స్థాయిలో మరింత గుర్తింపును తెస్తుంది.
Also Read: Nivetha Pethuraj: పెళ్లిపీటలు ఎక్కనున్న నివేదా.. సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్.. ఫోటోలు వైరల్
యాక్షన్-అడ్వెంచర్ జోనర్‌లో కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ సినిమాకు టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. బలమైన కథ, అద్భుతమైన విజువల్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణలు. ప్రేక్షకుల అంచనాలను భారీగా పెంచుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 5న దేశవ్యాప్తంగా విడుదల కానుంది.

