Cleanest Air: భారతదేశంలోని 10 స్వచ్ఛమైన గాలి పీల్చుకునే నగరాల జాబితా విడుదలైంది. ఇందులో కర్ణాటకలోని రెండు నగరాలు, తమిళనాడులోని రామనాథపురం ఉన్నాయి. పండుగల సీజన్, శీతాకాలం ప్రారంభమైన తరువాత, ప్రధాన నగరాలు, ముఖ్యంగా ఉత్తర భారతదేశం అంతటా ప్రస్తుతం భారీ వాయు కాలుష్యంతో ఇబ్బంది పడుతున్నాయి.ఈ నేపథ్యంలో వాయు కాలుష్యం లేని లేదా తక్కువ స్థాయిలో ఉన్న టాప్ 10 నగరాల జాబితా విడుదల చేశారు.
ఈ లిస్ట్ ప్రకారం మిజోరాం లోని ఐజ్వాల్, కర్ణాటక లోని బాగల్ కోట్, సమరాజనగర్, అస్సాం లోని గౌహతి, నాగాన్, కేరళలోని కొల్లం, త్రిసూర్, ఉత్తరాఖండ్ లోని రిషికేష్, జమ్మూకాశ్మీర్ లోని శ్రీనగర్ 100 కంటే తక్కువ ఎఐక్యూ తో స్వచ్ఛమైన గాలి లభించే ప్రాంతాలుగా ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Gujarat Tourism: గుజరాత్ కు టూరిస్టుల తాకిడి.. లక్షల్లో పర్యాటకులు
Cleanest Air: ఢిల్లీ ప్రస్తుతం అత్యంత కాలుష్య నగరంగా నిలిచింది. గాలి నాణ్యతను సూచించే ఎఐక్యూ 50 లోపు ఉంటే అది చాలా మంచి వాతావరణంగా చెబుతారు. 51 నుండి 100 వరకు ఎఐక్యూ ఉంటె అది సంతృప్తికరంగా ఉన్నట్టుగా చెబుతారు. అదే 101 నుండి 200 వరకు ఉన్నట్లయితే ఇబ్బందికరమైన గాలి నాణ్యతగా భావిస్తారు. ఇక 201 నుండి 300 వరకు ఎఐక్యూ ఉంటే అది అనారోగ్యకరంగా గుర్తిస్తారు. దానిని మించి అంటే 301 నుండి 400 ఉండే ఏఐక్యూ ప్రమాదకరమైనదిగా చెబుతారు.