Plane crash: కుప్పకూలిన భారీ విమానం..

Plane crash: లిథువేనియాలోని విల్నియస్ ఎయిర్ పోర్టు సమీపంలో ఒక భారీ కార్గో విమానం జనావాసాలపై కుప్పకూలింది. లిథువేనియా కాలమానం ప్రకారం ఈ సంఘటన ఈ తెల్లవారుజామున 5:28 గంటలకు చోటు చేసుకుంది. జర్మనీలోని లీప్ జిగ్ నుంచి బయలుదేరిన డీహెచ్ఎల్‌కు చెందిన బోయింగ్ 737 విమానం, విల్నియస్ ఎయిర్ పోర్టుకు ల్యాండ్ కావడానికి కొన్ని నిమిషాల ముందు లిప్‌కల్నిస్ అనే ప్రాంతంలోని జనావాసాలపై కూలింది.

ఈ ప్రమాదంలో పైలట్ మరణించగా, ముగ్గురు సిబ్బంది గాయపడినట్లు అంతర్జాతీయ మీడియా ప్రకటించింది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది, సహాయక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ఈ విమానం 31 సంవత్సరాల పాతది డీహెచ్ఎల్ కోసం స్విఫ్ట్ ఎయిర్ లైన్స్ సంస్థ నిర్వహిస్తోంది. అదృష్టం కొద్దీ విమానం కూలిన ప్రాంతంలోని ప్రజలు సురక్షితంగా ఉన్నారని లిథువేనియాకు చెందిన జాతీయ విపత్తు నిర్వహణ కేంద్రం తెలిపింది.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Rash Driving: మద్యం మత్తులో ర్యాష్‌ డ్రైవింగ్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *