Gujarat Tourism: గుజరాత్ రాష్ట్ర పర్యాటక శాఖ వివరాల ప్రకారం 2023-24 సంవత్సరంలో 21 లక్షల మందికి పైగా పర్యాటకులు గుజరాత్‌లోని సాంప్రదాయ పర్యాటక ప్రదేశాలను సందర్సించారు. UNESCO ప్రతి సంవత్సరం నవంబర్ 19 నుండి నవంబర్ 25 వరకు ప్రపంచ వారసత్వ వారోత్సవాలను జరుపుకుంటుంది. ఇందుకోసం భారత పురావస్తు శాఖ సహకారంతో దేశవ్యాప్తంగా పలు చారిత్రక వారసత్వ ప్రదేశాల్లో అవగాహన కల్పిస్తున్నారు.
ఇది కూడా చదవండి: DY Chandrachud: రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యం లేదు అంటున్న మాజీ సీజేఐ చంద్రచూడ్
గుజరాత్‌లో ఉన్న వాద్‌నగర్ చారిత్రక వారసత్వ ప్రదేశం, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వస్థలం కావడంతో కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి దీనిపై ప్రధానంగా దృష్టి ఉంది. దీని సాంస్కృతిక, చారిత్రక ప్రాధాన్యతను గుర్తించి, రాష్ట్ర ప్రభుత్వం వాద్‌నగర్‌లో ఆధునిక పర్యాటక సౌకర్యాలను అభివృద్ధి చేయడానికి గత మూడేళ్లలో రూ.70 కోట్లు ఖర్చు చేసింది.