Crime News: కనికరం లేని ఓ తండ్రి తన ఇద్దరు కవల కుమార్తెలను అత్యంత క్రూరంగా హత్య చేశాడు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘాతుకం చోటుచేసుకుంది. ఎంతో అల్లారుముద్దుగా పెంచాల్సిన తండ్రే కాలయముడిగా మారి పసి ప్రాణాలను బలితీసుకోవడం అందరినీ కలిచివేస్తోంది.
నిద్రలో ఉండగానే ఘాతుకం
పోలీసుల కథనం ప్రకారం.. కాన్పూర్‌కు చెందిన నిందితుడు తన ఇంట్లో గాఢ నిద్రలో ఉన్న ఇద్దరు కుమార్తెలపై పదునైన కత్తితో దాడి చేశాడు. వారు కేకలు వేయకుండా, తప్పించుకోకుండా నిద్రపోతున్న సమయంలోనే వారి గొంతు కోసి కిరాతకంగా చంపేశాడు.
మరణించిన ఇద్దరు అమ్మాయిలు కవలలు (Twins). నిందితుడు కొంతకాలంగా మానసిక ఒత్తిడి లేదా కుటుంబ కలహాల కారణంగా ఇబ్బంది పడుతున్నట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. అయితే హత్యకు గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
పోలీసుల అదుపులో నిందితుడు
ఘటన జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్తం మడుగులో పడి ఉన్న చిన్నారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
హత్య చేసిన తర్వాత అతనే పోలీసులకు ఫోన్ చేశాడు. పోలీసులు రావడంతో భార్యకు కూడా అప్పుడే విషయం తెలిసింది.
ఆమె భర్త తాగుడికి అలవాటు పడినట్టు ఆరోపణలు చేసింది. అలాగే 2014లో వాళ్లు లవ్ మ్యారేజ్ చేసుకున్నా, అది కొంత కాలమే బాగుందని.. తర్వాత తమ మధ్య గడిచిపోయింది ప్రేమ అని చెప్పారు. అలాగే తనని పుట్టింటికి కూడా పంపేవాడు కాదని ఆరోపించింది. అలాగే కొంత కాలంగా తనని, కుమారుడిని తీసుకుని సపరేట్ గా ఉండమని బలవంతం చేయడంతో కొన్ని నెలల నుండి కొడుకుతో కలిసి భర్తకు దూరంగా ఉంటుంది భార్య. కానీ కూతుళ్లను వదిలి ఉండలేక తిరిగి ఇంటికి వచ్చిన భార్య.. రాత్రి భోజనం చేసేటప్పుడు బాగానే ఉన్న భర్త, భోజనం తర్వాత పిల్లలని తన గదిలోకి తీసుకుని వెళ్లాడు. అక్కడే గొంతు కోసి చంపేశాడు.
భర్తకు అనుమానం ఉండటంతో తన ఇంట్లో ఉన్న ప్రతి చోటా కెమెరాలు అమర్చాడు, చివరికి బెడ్రూమ్ లో కూడా పెట్టాడు. ఘటన తర్వాత భార్య సీసీటీవీలో రికార్డు అయిన దృశ్యాలను చూడగా.. అందులో రాత్రి 2:30 నిమిషాల వరకు ఫోన్ మాట్లాడుతున్నాడు, తర్వాత లైట్ ఆఫ్ చేయడంతో అందరూ నిద్రపోతున్నారు అనుకుంది భార్య. కానీ పోలీసులు వస్తే గానీ తెలియలేదు అసలు నిజం. కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.
