గాంధీ జయంతి పురస్కరించుకొని ఈ నెల 2న రెండు తెలుగు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు బార్ అండ్ రెస్టారెంట్లు బంద్ కానున్నాయి. అలాగే మాంసం దుకాణాలు కూడా మూతపడనున్నాయి. గురువారం మద్యం దుకాణాలు వైన్ షాపులు తిరిగి తెరుచుకోనున్నాయి.
- మద్యం దుకాణాలు మూసేయాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఆదేశించింది. దీంతో తెలంగాణలో ఏపీలోనూ అన్ని లిక్కర్ దుకాణాలు, బార్లు మూసివేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. నిబంధనలు ఎట్టి పరిస్థితుల్లో ఉల్లంఘించవద్దని అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది