Ration Shop: రాష్ట్రవ్యాప్తంగా రేపు (శుక్రవారం) అన్ని రేషన్ షాపులు బంద్ కానున్నాయి. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ తాము కోరిన అనేక అంశాలపై హామీలు ఇచ్చినా, ఇప్పటివరకు ఒక్కటీ అమలు కాలేదని ఆరోపిస్తూ రేషన్ డీలర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు.
హామీలు అమలు చేయాలన్న డిమాండ్..
రేషన్ డీలర్లకు ప్రతి నెల రూ.5 వేల గౌరవ వేతనం, కమీషన్ పెంపు, హెల్త్ కార్డుల జారీ వంటి హామీలు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిందని,
ఇది కూడా చదవండి: Crime News: కొంప ముంచిన రీల్స్.. రెండో భార్యతో ఇన్స్టా రీల్స్.. తాటతీసిన ఫస్ట్ వైఫ్
అయితే ప్రభుత్వం ఏర్పడి దాదాపు 21 నెలలు గడిచినా ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని తెలంగాణ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బత్తుల రమేష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు..
“రేషన్ డీలర్ల కుటుంబాలకు హెల్త్ కార్డులు ఇవ్వాలి. దుకాణాల అద్దె, బియ్యం రవాణా ఖర్చులను ప్రభుత్వమే భరించాలి.
మా సమస్యలపై పలు మార్లు దృష్టి సారించాలని కోరినా స్పందన లేదు” అని రమేష్ బాబు అన్నారు.
ప్రజలకు ముందుగానే సమాచారం..
సంక్షేమ సంఘం పిలుపు మేరకు రేపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని రేషన్ షాపులు మూతపడనున్నాయని, వినియోగదారులు ముందుగానే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సంఘం సూచించిం
రేపు రాష్ట్రవ్యాప్తంగా రేషన్ షాపులు బంద్..
రాష్ట్రవ్యాప్తంగా రేపు (శుక్రవారం) అన్ని రేషన్ షాపులు బంద్ కానున్నాయి. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ తాము కోరిన అనేక అంశాలపై హామీలు ఇచ్చినా, ఇప్పటివరకు ఒక్కటీ అమలు కాలేదని ఆరోపిస్తూ రేషన్ డీలర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు.
హామీలు అమలు… pic.twitter.com/59escEU64V
— s5news (@s5newsoffical) September 4, 2025