Tollywood: టాలీవుడ్‌లో మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత కేపీ చౌదరి (కృష్ణ ప్రసాద్ చౌదరి) గోవాలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని పోలీసులు ధృవీకరించారు.
డ్రగ్స్ కేసులో అరెస్టు
కేపీ చౌదరి 2023లో డ్రగ్స్ విక్రయాల కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన బెయిల్‌పై విడుదల అయ్యారు. అయితే, ఈ కేసు అతనిపై తీవ్ర ప్రభావాన్ని చూపినట్టు తెలుస్తోంది.
ఆర్థిక ఇబ్బందులతో బాధపడిన చౌదరి
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన “కబాలి” చిత్రానికి తెలుగు వెర్షన్ నిర్మాతగా కేపీ చౌదరి పనిచేశారు. కానీ, ఈ సినిమా భారీగా నష్టాలు రావడంతో ఆయన తీవ్ర ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్నట్టు సమాచారం.
కుటుంబానికి సమాచారం
కేపీ చౌదరి మృతిపై గోవా పోలీసులు ఆయన తల్లి (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ) కు సమాచారం అందించారు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది, కానీ ఆర్థిక ఒత్తిడి కారణంగా ఈ ఘటన జరిగినట్లు అనుమానిస్తున్నారు.
ఈ ఘటన టాలీవుడ్‌లో సంచలనం సృష్టించగా, సినీ పరిశ్రమకు చెందిన పలువురు ఆయన మరణంపై శోకాన్ని వ్యక్తం చేస్తున్నారు.