How to Store Potatoes: ఇంట్లో బంగాళదుంపలు ఉంటే రకరకాల వెరైటీలు చేసుకోవచ్చు. కానీ బంగాళాదుంపలు త్వరగా కుళ్ళిపోతాయి. చల్లని వాతావరణంలో మొలకెత్తుతాయి. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే బంగాళాదుంపలుమొలకెత్తకుండా ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి.
బంగాళాదుంపలను రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయొద్దు. చల్లని వాతావరణం స్టార్చ్‌ను చక్కెరగా మారుస్తుంది.
అధిక తేమ బంగాళదుంపలు మొలకెత్తడానికి కారణమవుతుంది. వీటిని పేపర్ బ్యాగులు, బుట్టలు వంటి గాలి చొరబడని కంటైనర్లలో నిల్వ చేయడం మంచిది.
ఇది కూడా చదవండి: Sprouted Seeds: కొత్తగా పెళ్లైన వారు మొలకెత్తిన గింజలు ఎందుకు తినాలి..?
How to Store Potatoes: బంగాళాదుంపలను ఉల్లిపాయలు లేదా అరటిపండ్లతో నిల్వ చేయవద్దు. ఇవి ఇథిలీన్ వాయువును విడుదల చేస్తాయి, దీని వలన బంగాళాదుంపలు వేగంగా మొలకెత్తుతాయి.
నల్ల మచ్చలు ఉన్న బంగాళాదుంపలను లేదా చెడిపోయిన బంగాళాదుంపలను కొనొద్దు. మార్కెట్ నుండి తెచ్చిన బంగాళదుంపలను చల్లని, పొడి, చీకటి ప్రదేశంలో నిల్వ చేయాలి.
బంగాళాదుంపలను సూర్యకాంతికి వీలైనంత దూరంగా ఉంచడం మంచిది. అధిక కాంతి పచ్చదనాన్ని ప్రేరేపించి..క్లోరోఫిల్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీన్ని వల్ల బంగాళాదుంపలు చేదుగా మారుతాయి.