Srisailam : శ్రీశైల మహా క్షేత్రం టోల్‌గేట్ వద్ద జరిగిన అక్రమాల కారణంగా 8 మందిపై చర్యలు తీసుకున్నారు. టోల్‌గేట్‌లో సిబ్బంది చేతివాటం ప్రదర్శించడంతో, అక్కడ ఉండాల్సిన డబ్బుకంటే అధికంగా నగదు ఉన్నట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి (ఈవో) గుర్తించారు. ఈ కారణంగా సంబంధిత సిబ్బందిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
శ్రీశైలం దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే ఈ టోల్‌గేట్ ద్వారా వాహనదారుల నుంచి రుసుము వసూలు చేస్తారు. జనవరి 5న దేవస్థానం అధికారులు టోల్‌గేట్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో సిబ్బందిచే ఉండాల్సిన నగదుతో పోలిస్తే అధికంగా డబ్బు ఉండటాన్ని గుర్తించారు. దీనిపై విచారణ జరిపిన తర్వాత నివేదికను ఆలయ ఈవో శ్రీనివాసరావు పరిశీలించారు.
విచారణ నివేదిక ఆధారంగా, రెగ్యులర్ ఉద్యోగి ఎం. రామకృష్ణుడు, కాంట్రాక్టు సిబ్బంది జి. మల్లికార్జున రెడ్డి, బి. నాగ పరమేశ్వరుడు, ఎన్. గోవిందు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు మల్లికార్జున రెడ్డి, బీఆర్. మల్లేశ్వర్ రెడ్డి, డైలీ వేజ్ సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు. టోల్‌గేట్ ఇన్‌చార్జి అధికారి శ్రీనివాసరావును కూడా విధుల నుంచి తొలగించారు.
తదుపరి చర్యగా, వారి స్థానంలో ఇతర సిబ్బందిని నియమించారు. టోల్‌గేట్ నిర్వహణలో గౌరవత్మకమైన వ్యవస్థను నిలుపుదల చేయడానికి ఈ చర్యలు చేపట్టినట్లు అధికారుల తెలిపారు.