Emergency: కంగనా రనౌత్ నటించి, నిర్మించిన ‘ఎమర్జెన్సీ’ మూవీ ఈ నెల 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇటీవల ఈ సినిమాను నాగపూర్ లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కర్ కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జీవితంలో అత్యంత కీలకమైన ఎమర్జెన్సీ ప్రకటన తదనంతర పరిణామాలపై ఈ సినిమాను కంగనా రనౌత్ తెరకెక్కించింది. అయితే ప్రస్తుతం భారత్ – బంగ్లాదేశ్ మధ్య దౌత్యపరమైన సంబంధాలు సక్రమంగా లేని కారణంగా ‘ఎమర్జెన్సీ’ని ఆ దేశంలో ప్రదర్శించడం లేదు. 1971లో పాక్ తో యుద్థ జరిగిన తర్వాత ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ ఏర్పాటుకు సహకారాన్ని అందించారు. దాంతో బంగ్లాదేశ్ తొలి అధ్యక్షుడు షేక్ ముజిబుర్ రెహమాన్… ఇందిరా గాంధీని దుర్గామాతతో పోల్చాడు. ప్రస్తుతం అధికారంలో వున్న వారు ముజిబుర్ రెహ్మాన్ ను పూర్తి వ్యతిరేకులు కావడంతో ఈ చిత్రాన్ని నిషేధించినట్టు తెలుస్తోంది. అయితే గత యేడాది డిసెంబర్ లో విడుదలైన ‘పుష్ప-2’ చిత్రం సైతం బంగ్లాదేశ్ లో విడుదల కాలేదు. కాకపోతే దానికి ముందు వచ్చిన ‘స్త్రీ-2’, ‘బూల్ బులయ్యా -2’ చిత్రాలు మాత్రం అక్కడ రిలీజ్ అయ్యాయి.
