Khairatabad Ganesh Shobhayatra

Khairatabad Ganesh Shobhayatra: ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనానికి కౌంట్ డౌన్ స్టార్ట్..

Khairatabad Ganesh Shobhayatra: భాగ్యనగరం హైదరాబాద్ గణేష్ ఉత్సవాలకు కేంద్రబిందువుగా నిలుస్తుంది. చార్మినార్, ఫిలింసిటీ, హైటెక్ సిటీ వంటి గుర్తింపులు వచ్చినా.. నగర సంస్కృతిని ప్రతిబింబించే ప్రతీక మాత్రం వినాయక చవితి శోభాయాత్రే. ఏడు దశాబ్దాల చరిత్ర గల ఈ మహోత్సవం నేటికీ అదే ఉత్సాహం, అదే జోష్‌తో సాగుతోంది. విదేశీ పర్యాటకులనూ ఆకట్టుకునే ఈ శోభాయాత్ర నగరంలోని ఆధ్యాత్మికత, ఐక్యత, సాంస్కృతిక వైభవాలకు ప్రతీకగా నిలుస్తోంది.

నగరాన్ని ఏకం చేసే శోభాయాత్ర

హైదరాబాద్ కుతుబ్ షాహీ, నిజాం పాలన నుంచి ఆధునిక సాఫ్ట్‌వేర్ హబ్‌గా మారినా.. నగరాన్ని ఒక్కటిగా కట్టిపడేసే సంప్రదాయం గణేష్ నిమజ్జనం. ప్రతి ఏడాది జరిగే ఈ శోభాయాత్ర 33 కిలోమీటర్ల పొడవున సాగి, 40 గంటలపాటు గణేశ్ భక్తులను మంత్ర ముగ్ధులను చేస్తుంది. 50 వేలకుపైగా గణేశ్ విగ్రహాలు ఈ మహానిమజ్జనంలో భాగం అవుతాయి.

భారీ భద్రతా ఏర్పాట్లు

నగరమంతా పండగ వాతావరణంలో మునిగిపోతున్నప్పటికీ భద్రతా ఏర్పాట్లు మాత్రం కట్టుదిట్టంగా ఉంటాయి. ఈ సంవత్సరం 30 వేలకుపైగా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. నగరంలో 403 క్రేన్లు, హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల 30 క్రేన్లు సిద్ధంగా ఉన్నాయి. 10 లక్షల భక్తులు హాజరవుతారని అంచనా. 200 మంది గజ ఈతగాళ్లు, 13 కంట్రోల్ రూమ్‌లు, 160 యాక్షన్ టీమ్‌లు, 3200 ట్రాఫిక్ పోలీసులు, 14,486 శానిటేషన్ సిబ్బంది శోభాయాత్ర విజయవంతం కోసం కష్టపడుతున్నారు. ప్రత్యేకంగా 600 ఆర్టీసీ బస్సులు ట్యాంక్ బండ్ వైపు దారితీస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Nirmala sitaraman: రష్యా చమురు కొనుగోలుపై భారత్ ధృఢ నిర్ణయం 

బాలాపూర్ లడ్డూ హాట్ టాపిక్

గణేష్ నిమజ్జనాలకి ప్రత్యేక ఆకర్షణ బాలాపూర్ లడ్డూ వేలం. 1980 నుంచి హాట్ ఫేవరెట్‌గా కొనసాగుతున్న ఈ వేలం 1994లో 10 వేల రూపాయలు దాటినప్పటి నుంచి ప్రతి ఏడాది రికార్డులు తిరగరాస్తోంది. గత ఏడాది బాలాపూర్ లడ్డూ 30 లక్షల 1,000 రూపాయలకు అమ్ముడైంది. ఈ సంప్రదాయం నగరంలోని అన్ని మండపాలకు ప్రేరణగా మారింది. ఇప్పుడు అపార్ట్‌మెంట్‌లు, గేటెడ్ కమ్యూనిటీల్లో కూడా గణేశ్ లడ్డూల వేలం పండగ ఉత్సాహాన్ని మరింత పెంచుతోంది.

భాగ్యనగర గణేష్ శోభాయాత్ర అంటే కేవలం నిమజ్జనం మాత్రమే కాదు, ఇది నగరంలోని సంప్రదాయాల సాక్ష్యం, భక్తి వైభవం, ఐక్యతకు ప్రతీక. ఏటా జరిగే ఈ మహోత్సవం హైదరాబాద్‌ను మరోసారి ఒకే జెండా కిందకు తేవడంలో సక్సెస్ అవుతుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *