SA20 Final: సౌతాఫ్రికా టీ20 లీగ్ ఫైనల్ దశకు చేరుకుంది. శనివారం జరిగే ఫైనల్లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్, ముంబై ఇండియన్స్ కేప్ టౌన్ జట్లు తలపడనున్నాయి. వరుసగా రెండు సార్లు టైటిల్ సాధించిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ హ్యాట్రిక్ టైటిల్ పై కన్నేసిన. అదే విధంగా, టేబుల్ టాపర్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ కేప్ టౌన్ తన తొలి టైటిల్‌ను సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తుంది.
లీగ్‌లో మొదటి మ్యాచ్‌లో ఓటమితో ప్రారంభించిన సన్‌రైజర్స్, తర్వాత అనేక కీలక మ్యాచ్‌లను గెలిచి ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో జోబర్గ్ సూపర్ కింగ్స్‌ను ఓడించి, క్వాలిఫయర్-2 లో పార్ల్ రాయల్స్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. అటు వైపు, క్వాలిఫయర్-1 లో ముంబై ఇండియన్స్ కేప్ టౌన్ పార్ల్ రాయల్స్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. ఇరు జట్లు బలబలాల పరంగా సమంగా ఉన్నప్పటికీ, ముంబై కేప్ టౌన్ కొంచెం మెరుగ్గా ఉంది.
ఇది కూడా చదవండి: Champions Trophy 2025: టీమిండియా కెప్టెన్సీ కోసం కొత్త పేరు..! అందరికీ ఛాంపియన్స్ ట్రోఫీ నే ముఖ్యం..!
సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌కు కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్, ఓపెనర్ టోనీ డీ జోర్జి సూపర్ ఫామ్‌లో ఉన్నారు. వీరు కనుక అత్యుత్తమ ప్రదర్శన కనబరిస్తే సన్‌రైజర్స్‌కు విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. ముంబై జట్టులో ర్యాన్ రికెల్టన్, రాసీ వాన్ డెర్ డస్సెన్, డెవాల్డ్ బ్రెవిస్ సూపర్ ఫామ్‌లో ఉండగా, బౌలింగ్‌లో ఫర్చూన్, దునిత్ చెలరేగుతున్నారు.
భారత కాలమానం ప్రకారం ఫైనల్ మ్యాచ్ రాత్రి 9 గంటలకు ప్రారంభమవుతుంది. సెంచూరియన్‌లో జరిగే ఈ మ్యాచ్‌లో పిచ్ బౌలర్లు, బ్యాట్స్‌మెన్ ఇద్దరికీ అనుకూలంగా ఉంటుంది. ఈ టోర్నీని స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ ప్రసారం చేస్తున్నది. స్టార్ స్పోర్ట్స్ ఛానెల్స్‌లో మరియు డీస్నీ హాట్ స్టార్ యాప్‌లో ఈ మ్యాచ్‌ను చూడొచ్చు.