Vizag

Vizag: నలుగురు విద్యార్థుల మిస్సింగ్ కలకలం..

Vizag: సినిమా చూసారు. ఆ దెబ్బకు పారిపోయారు. సినిమా చూసి..జంప్ అయ్యారా ? లేక సినిమా నచ్చి జంప్ అయ్యారా ? తెలియదు కాని. మొత్తానికి బస్సెక్కి ..థియేటర్ నుంచి ఏటో వెళ్లిపోయారు. అసలు ఏ మాత్రం క్లూ లేని ఈ కేసులో ఖాకీలు మాత్రం మొత్తానికి పట్టుకుంటాం అంటున్నారు. అయినా ఎక్కడికి పోతారు. ఎటు పోయినా..నాలుగు రోజులు అంతే. మల్లి తిరిగి తిరిగి ఇంటికే వచ్చేస్తారు..

విశాఖపట్నం నగరంలో నలుగురు విద్యార్థుల మిస్సింగ్ కలకలం రేపింది. ఈ మధ్య రిలీజ్ అయినా లక్కీ భాస్కర్ అనే మూవీ చూసిన విద్యార్థులు అందులో హీరో తరహాలో సులువుగా డబ్బులు సంపాదించవచ్చు.. కార్లు, ఇళ్లు కొనేసి తిరిగి వస్తామని స్నేహితుల వద్ద చెప్పి హాస్టల్ నుండి పరారయ్యారని తెలుస్తోంది.. మహారాణి పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది..

Vizag: St. Anns హైస్కూల్ లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు కిరణ్ కుమార్, కార్తీక్, చరణ్ తేజ, రఘుగా గుర్తించారు.. విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.. ఆచూకీ కోసం రైల్వే స్టేషన్, బస్ స్టాండ్స్ లోని సీసీటీవీ ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలించారు.

అయితే, సినిమాల ప్రభావం కొంత మేర ప్రజలపై ఉంటుందంటారు.. కానీ, స్కూల్‌ విద్యార్థులే సినిమా చూసి.. హాస్టల్‌ నుంచి వెళ్లిపోవడం కలకలం రేపుతోంది.. కాగా, 1989-92 బ్యాక్‌డ్రాప్‌తో వచ్చిన సినిమా లక్కీ భాస్కర్‌.. ఈ మధ్య రిలీజ్‌ అయిన ఈ సినిమా హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది.. ఇక, ఓటీటీలోనూ ఈ సినిమా దుమ్మురేపుతుందనే చెప్పాలి..

Vizag: హీరో.. ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఓ సాధారణ బ్యాంక్ ఉద్యోగిగా పనిచేస్తూ ఉంటాడు. తనకు వచ్చే జీతంతో కుటుంబం మొత్తాన్ని నడిపించడానికి నానా కష్టాలు పడతాడు.. ఆ తర్వాత బ్యాంకులో లోన్‌ తీసుకోవడానికి వచ్చిన ఓ వ్యక్తితో కలిసి పెద్ద రిస్క్ చేయడం ఓవైపు అయితే.. మరోవైపు.. ఏకంగా బ్యాంక్‌లో అసిస్టెంట్ మేనేజర్ కూడా అవుతాడు..

కోట్లు సంపాదించి చివరకు సీబీఐకి విచారణ ఎదుర్కుంటాడు.. మేం కూడా ఆ తరహాలో సంపాదిస్తామంటూ.. స్కూల్‌ విద్యార్థులు.. అది కూడా.. ఏమీ తెలియని వయస్సులో ఉన్న బాలురు హాస్టల్‌ నుంచి వెళ్లిపోవడం కలకలం రేపుతోంది..

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Ukku Satyagraham: గద్దర్ నటించిన ఆఖరి చిత్రం.. రిలీజ్ ఎప్పుడంటే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *