Kedarnath Temple

Kedarnath Temple: నేటి నుంచే కేదార్నాథ్ దర్శనం.. రిజిస్టర్ చేసుకున్న 14.5 లక్షల మంది

Kedarnath Temple: కేదార్నాథ్ కి వేలాలనుకుంటున భక్తులకి గుడ్ న్యూస్ ఆరు నెలల శీతాకాల విరామం తర్వాత, హిమాలయ పర్వత శ్రేణుల్లో కొలువైన అత్యంత పవిత్రమైన కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలు నేడు (బుధవారం) అక్షయ తృతీయ శుభ సందర్భంగా భక్తుల కోసం తెరుచుకున్నాయి. తెల్లవారుజాము నుంచే ఆలయ ప్రాంగణం భక్తుల “హర హర మహాదేవ్” నినాదాలతో మార్మోగుతోంది. చార్‌ధామ్ యాత్రలో అత్యంత కీలకమైన ఈ ఘట్టం ప్రారంభం కావడంతో భక్తులలో ఆధ్యాత్మిక ఉత్సాహం ఉప్పొంగుతోంది.

ఘనంగా బాబా డోలీ రాక

ఉఖీమఠ్‌లోని ఓంకారేశ్వర ఆలయం నుంచి బాబా కేదార్ నాథ్ ఉత్సవమూర్తి (బాబా డోలీ) సంప్రదాయబద్ధంగా ఊరేగింపుగా ఇప్పటికే కేదార్‌నాథ్ ధామ్‌కు చేరుకుంది. ఆలయాన్ని టన్నుల కొద్దీ రంగురంగుల పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ప్రధాన అర్చకుల వేద మంత్రోచ్ఛారణలు, మేళతాళాల మధ్య ఆలయ తలుపులు తెరిచి, శివలింగానికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు.

రికార్డు స్థాయిలో రిజిస్ట్రేషన్లు

ఈ ఏడాది చార్‌ధామ్ యాత్రకు భక్తుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది.

  • మొత్తం రిజిస్ట్రేషన్లు: అధికారుల లెక్కల ప్రకారం ఇప్పటివరకు సుమారు 14.5 లక్షల మందికి పైగా భక్తులు చార్‌ధామ్ యాత్ర కోసం నమోదు చేసుకున్నారు.

  • కేదార్ నాథ్ క్రేజ్: ఇందులో కేవలం కేదార్‌నాథ్ బాబా దర్శనం కోసమే 4,95,173 మంది భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకోవడం విశేషం.

దర్శనాలపై ఆంక్షలు – ఆలయ కమిటీ నిర్ణయాలు

భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తుల భద్రత మరియు సౌకర్యార్థం ఉత్తరాఖండ్ ప్రభుత్వం, ఆలయ కమిటీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.

  • పరిమిత దర్శనాలు: ప్రతిరోజూ 15,000 మంది భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతి ఉంటుంది.

  • నో మొబైల్స్: ఆలయ పవిత్రతను కాపాడేందుకు ఆలయ ప్రాంగణంలో మొబైల్ ఫోన్ల వినియోగాన్ని పూర్తిగా నిషేధించారు.

  • రీల్స్ పై నిషేధం: ఆలయం వద్ద ఫోటోలు తీయడం, వీడియోలు చేయడం లేదా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ రూపొందించడం వంటి పనులపై కఠిన ఆంక్షలు విధించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *