Horoscope Today:ఈరోజు బుధవారం ఏప్రిల్ 22, నాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఎవరికి సానుకూలంగా ఉందో, ఎవరికి లేదో తెలుసుకోండి. అలాగే ఉద్యోగం, ఇంకా వ్యాపారంలో ఎదురయ్యే సమస్యలు, సూచనలను మేషం నుండి మీనం వరకు తెలుసుకోండి.
మేషం (Aries): మీకు పట్టుదల అవసరమైన సమయం. తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా, మీ మనోధైర్యంతో వాటిని అధిగమిస్తారు. కార్యాలయంలో లేదా సమాజంలో మీ కృషికి తగిన గుర్తింపు, గౌరవం లభిస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగండి.
-
సూచన: ఇష్టదైవ స్మరణ మీకు మానసిక బలాన్ని ఇస్తుంది.
వృషభం (Taurus): ఈరోజు మీకు శుభప్రదంగా ఉంటుంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఒక మంచి వార్త వింటారు. ఆర్థిక ఇబ్బందులు తొలగి, మిత్రుల నుండి సాయం అందుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. సానుకూల ఆలోచనలతో ముందుకు వెళ్తారు.
-
సూచన: దేవాలయ సందర్శన వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.
మిథునం (Gemini): పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదురైనప్పటికీ, మీ వివేకంతో వాటిని పరిష్కరించుకుంటారు. నిలిచిపోయిన ధనం చేతికి అందుతుంది, ఇది మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది.
-
సూచన: ఈశ్వర ఆరాధన మీకు మేలు చేస్తుంది.
కర్కాటకం (Cancer): కొత్త పనులు ప్రారంభించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసర శ్రమ కలగకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించండి. ఆత్మీయుల అండదండలు మీకు ధైర్యాన్ని ఇస్తాయి. అయితే, ఇతరులను అతిగా నమ్మి రహస్యాలను పంచుకోవద్దు.
-
సూచన: శివదర్శనం వల్ల ఓర్పు, శక్తి లభిస్తాయి.
సింహం (Leo): లాభస్థానంలో గజకేసరి యోగం మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. నిలకడగా ఆలోచిస్తే అనుకున్న పనులు నెరవేరుతాయి. తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సంయమనం పాటించండి.
-
సూచన: గోసేవ లేదా గోశాలను సందర్శించడం వల్ల సానుకూలత పెరుగుతుంది.
కన్య (Virgo): వృత్తి, వ్యాపార రంగాల్లో ఉన్న వారికి పురోగతి ఉంటుంది. కెరీర్‌కు సంబంధించిన ఒక తీపి కబురు వినే అవకాశం ఉంది. కుటుంబంలో శుభకార్యాలు లేదా విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది.
-
సూచన: శివాలయ సందర్శన ఆంతరంగిక ప్రశాంతతను ఇస్తుంది.
తుల (Libra): మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ ఉత్తమ ఫలితాలు కనిపిస్తాయి. కొత్త ప్రాజెక్టులు లేదా ముఖ్యమైన పనులు ప్రారంభించడానికి ఇది సరైన సమయం. మనసుకి నచ్చిన సంఘటనలు జరిగి ఉత్సాహంగా గడుపుతారు.
-
సూచన: శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం శ్రేయస్కరం.
వృశ్చికం (Scorpio): ఈరోజు శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. బంధువులతో లేదా సహోద్యోగులతో అనవసర వాదనలకు దిగకండి. ఖర్చుల విషయంలో నియంత్రణ అవసరం, లేదంటే ధనవ్యయం పెరగవచ్చు. అధికారుల వద్ద సంయమనంతో వ్యవహరించాలి.
-
సూచన: నవగ్రహ ధ్యానం ప్రతికూలతలను తగ్గిస్తుంది.
ధనుస్సు (Sagittarius): గజకేసరి యోగం వల్ల మీకు అదృష్టం కలిసి వస్తుంది. ఆర్థికంగా లాభదాయకమైన సమయం. సమయస్ఫూర్తితో మీరు తీసుకునే నిర్ణయాలు మీ స్థాయిని పెంచుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.
-
సూచన: ఇష్టదైవ ప్రార్థన ఆధ్యాత్మిక సంతృప్తిని కలిగిస్తుంది.
మకరం (Capricorn): భవిష్యత్తుకు సంబంధించి మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. పనులను దృఢ సంకల్పంతో పూర్తి చేస్తారు. అధికారుల ప్రశంసలు పొందుతారు.
-
సూచన: హనుమాన్ చాలీసా లేదా ఆంజనేయ స్వామి స్తోత్ర పారాయణ మేలు చేస్తుంది.
కుంభం (Aquarius): ముందుచూపుతో చేసే పనులు విజయవంతమవుతాయి. ఆర్థికంగా కొంత ఉపశమనం లభిస్తుంది, ముఖ్యంగా పాత అప్పుల నుండి విముక్తి పొందే అవకాశం ఉంది. కీలక విషయాల్లో పెద్దల సలహాలను పాటించడం ఉత్తమం.
-
సూచన: ఇష్టదేవతారాధన మీలో ఆశావహ దృక్పథాన్ని నింపుతుంది.
మీనం (Pisces): ఈరోజు మీకు కొంత ఒత్తిడితో కూడిన సమయం. పనుల్లో జాప్యం జరిగినా ఓర్పుగా ఉండండి. సహనం కోల్పోతే పరిస్థితి మరింత జటిలమవుతుంది. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఆందోళన చెందకుండా నిదానంగా వ్యవహరించండి.
-
సూచన: శివ సహస్రనామ పారాయణ చేయడం వల్ల ఆటంకాలు తొలగుతాయి.
