Cyber Crime: కాల్ వచ్చింది. ఫోన్ మోగింది. హలొ అన్నాడు..కతం బ్యాంకులోని అమౌంట్ మొత్తం మాయం. అంత పవర్ ఫుల్ నెంబర్ అది. ఆ నెంబర్ నుంచి కాల్ వస్తే ..లిఫ్ట్ చేసిన తరువాత ..అరె లిఫ్ట్ చేయకూడదు కదా అని అనుకున్న నో యూస్. ఎలా అలా అంటారా ? ఇదిగో ఇది చూసి లిఫ్ట్ చేయాలో చేయొద్దో డిసైడ్ అవ్వండి. లేదా ..లైట్ అనుకుంటే౩ ..వన్ డే ..అయ్యో అనుకోవాలి.
రోజురోజుకీ సైబర్ నేరాలు డబ్బులు దోచుకునే స్థాయి నుంచి మనల్ని నేరస్తులను చేసే స్థాయికి పెరిగిపోతున్నాయి. మొబైల్ ఫోన్ కి వచ్చే మెసేజ్ చూడాలన్న, వాట్సాప్ లో వచ్చిన సందేశాలను చూడాలన్న భయపడే పరిస్థితి వచ్చింది. ప్రజల యొక్క అవసరాలను బట్టి …వాటిని ఆసరా చేసుకుని కొత్త కొత్త సైబర్ స్కాములకు తెరతీస్తున్నారు సైబర్ నెరగాళ్లు . ఇప్పుడు ఏకంగా ఫోన్ కాల్స్ చేసి మరీ నిలువు దోపిడీ చేస్తున్నారు.
Cyber Crime: లాత్వియా, సెర్బియా, టాంజానియా, బెలారస్, లోవా వంటి దేశాల కోడ్లతో మొదలయ్యే ఫోన్ నెంబర్లతో కాల్స్ చేస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. మన మొబైల్ ఫోన్లో ఉన్న డేటాను సెకండ్లలో చోరీ చేయడంతో పాటు వాటి ద్వారా సైబర్ క్రైమ్ చేసి మనల్ని అడ్డంగా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు .ఈ క్రమంలోనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు సైబర్ పోలీసులు.
Cyber Crime: అపరిచిత నెంబర్ల నుండి వస్తున్న ఫోన్ కాల్స్ ను రిసీవ్ చేసుకోవద్దని సూచిస్తున్నారు సైబర్ క్రైం పోలీసులు. ఒకవేళ ఆ ఫోన్ కాల్స్ ని లిఫ్ట్ చేస్తే వారు మన ఫోన్లోని కాంటాక్ట్ జాబితాతో పాటు బ్యాంకు క్రెడిట్ కార్డుల వివరాలను కాపీ చేసుకునే ప్రమాదం ఉందని చెబుతున్నారు. తద్వారా మీ సిమ్ కార్డును వారు యాక్సెస్ చేసి దానితో నేరాలకు పాల్పడే అవకాశం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు.
సైబర్ మోసగాళ్లు స్మార్ట్‌ఫోన్లను టార్గెట్ చేస్తున్నారు. ఫోన్‌లోని ముఖ్యమైన సమాచారాన్ని హ్యాక్ చేస్తూ డబ్బు దోచుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో ఆన్‌లైన్ స్కామ్‌ల కేసులు ఎక్కువగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మోసగాళ్ల నుంచి తమను తాము రక్షించుకోవాలని ప్రజలకు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. నిర్దిష్ట నంబర్ల నుండి వచ్చే కాల్స్‌కు ఎలాంటి సమాధానం ఇవ్వొద్దని హెచ్చరిస్తోంది. ముఖ్యంగా +77, +89 , +85, +86 , +84 +77 కోడ్‌ల నుండి వచ్చే కాల్స్ ను లిఫ్ట్ చేసే ముందు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.