Tirumala: శ్రావణమాసాన్ని పురస్కరించుకొని వచ్చే ఆగస్టు నెలలో తిరుమలలో పవిత్రోత్సవాలను నిర్వహించనున్నారు. ఆగస్టు 4 నుంచి మూడు రోజులపాటు ఈ వేడుకలు జరగనున్నాయి. అపచారాలకు ప్రాయశ్చిత్తంగా ఈ పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. మూడు రోజులపాటు జరిగే ఈ వేడుకల్లో తొలిరోజున పవిత్ర ప్రతిష్ఠ, రెండో రోజు సమర్పణ, మూడోరోజు పూర్ణాహుతి నిర్వహిస్తారు. ఆయా రోజుల్లో శ్రీనివాసుడిని నిత్యం రూపుదిద్దుతారు.
