Tirumala: తిరుమల లడ్డు ధర పెంపు వార్తలపై స్పందించిన టిటిడి చైర్మన్

Trimula: తిరుపతి లడ్డూ ధరను పెంచే ఎలాంటి ప్రతిపాదన టీటీడీ వద్ద లేదని, భవిష్యత్తులో కూడా అలాంటి ఆలోచన చేయబోమని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో కొన్ని రోజులుగా సోషల్ మీడియా, కొన్ని వార్తా సంస్థల్లో వస్తున్న కథనాలు పూర్తిగా నిరాధారమైనవి, అవాస్తవమైనవి అని ఖండించారు.

కొన్ని బాధ్యతారహిత మీడియా సంస్థలు ఉద్దేశపూర్వకంగా టీటీడీ ప్రతిష్ఠను దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఈ తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అసత్య ప్రచారాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే ప్రయత్నంగా ఉన్నాయని పేర్కొన్నారు.

భక్తులు ఈ వదంతులను నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తూ, పవిత్రమైన లడ్డూ ప్రసాదం ధరలో ఎటువంటి మార్పు చేయబోమని బీఆర్ నాయుడు పునరుద్ఘాటించారు. టీటీడీపై బురద చల్లే ప్రయత్నాలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *