Tirumala: తిరుమలలో నాలుగేళ్ల చిన్నారి దీక్షిత కిడ్నాప్‌కు గురైంది. ఆస్థాన మండపం వద్ద ఆడుకుంటున్న దీక్షితను ఓ వృద్ధురాలు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. చిన్నారి తల్లిదండ్రులు తిరుమలలో చిరు వ్యాపారం చేస్తుంటారు.
సీసీ టీవీలో రికార్డ్ అయిన కిడ్నాప్ దృశ్యాలు
ఈ రోజు సాయంత్రం చిన్నారి ఆస్థాన మండపం వద్ద ఆడుకుంటుండగా, అక్కడికి వచ్చిన వృద్ధురాలు ఆమెను తీసుకెళ్లింది. అనంతరం ఆర్టీసీ బస్సులో తిరుపతికి తీసుకెళ్లినట్లు సీసీ టీవీ ఫుటేజ్‌లో రికార్డ్ అయింది.
వృద్ధురాలి ఫొటో విడుదల
చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. కిడ్నాప్‌కు పాల్పడ్డ వృద్ధురాలి ఫొటోను విడుదల చేశారు. గతంలోనూ తిరుమలలో కొంతమంది చిన్నారులు అదృశ్యమైన ఘటనలు జరగడంతో, దీక్షిత కిడ్నాప్ ఘటనపై తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తమ కుమార్తెను త్వరగా గుర్తించి తమకు అప్పగించాలని వారు కోరుతున్నారు. పోలీసులు చిన్నారి ఆచూకీ కోసం దర్యాప్తును ముమ్మరం చేశారు.