Tirumala

Tirumala: శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. ఇకపై అది లేకుంటే నో ఎంట్రీ..!

Tirumala: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తుల కోసం ఒక ముఖ్య నిర్ణయం తీసుకుంది. ఇకపై తిరుమలకు వచ్చే అన్ని వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి చేసింది. ఈ నిబంధన ఆగస్ట్ 15వ తేదీ నుంచి అమల్లోకి రానుంది.

టీటీడీ తెలిపిన వివరాల ప్రకారం, అలిపిరి చెక్‌పోస్ట్ వద్ద వాహనాల తనిఖీ సమయంలో భద్రతా ప్రమాణాలు మెరుగుపరచడం, రద్దీ తగ్గించడం, పారదర్శక సేవలు అందించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ప్రత్యేకంగా పర్వదినాలు, ఉత్సవాల సమయంలో వాహనాల బారులు తగ్గించడమే ఈ కొత్త విధానం లక్ష్యం అని తెలిపింది.

ఫాస్టాగ్ లేని వాహనాలకు అనుమతి లేదు
ఆగస్ట్ 15 నుంచి ఫాస్టాగ్ లేని వాహనాలను తిరుమల కొండపైకి అనుమతించబోమని టీటీడీ స్పష్టం చేసింది. ఫాస్టాగ్ లేని వారికి అలిపిరి తనిఖీ కేంద్రంలోనే ఐసీఐసీఐ బ్యాంకు సహకారంతో ఫాస్టాగ్ జారీ సౌకర్యం కల్పించనుంది. అక్కడే తక్కువ సమయంలో ఫాస్టాగ్ తీసుకుని మాత్రమే భక్తులు కొండపైకి వెళ్లగలరని తెలిపింది.

టీటీడీ భక్తులను కోరుతూ – “తిరుమల యాత్రకు రాకముందే మీ వాహనంలో ఫాస్టాగ్ అమర్చించుకోండి. మీ సహకారం వల్ల సేవలు మరింత సులభం అవుతాయి” అని సూచించింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *