Telangana: నిర్మల్ జిల్లాలో పులి సంచారం ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. కుంటాల మండలంలో పులి సంచరిస్తుండటంతో బయటకు రావాలంటే ప్రజలు జంకుతున్నారు… కుంటాల మండలంలో సాయన్న అనే రైతుకు పులి కనిపించడంతో రైతు భయంతో పరుగులు పెట్టాడు…పులి పశువు పై దాడి చేసింది..రైతు ప్రాణాలతో బయట పడటంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు పులి జాడ కోసం జెల్లెడ పెట్టి గాలిస్తున్నారు. మహా రాష్ట్ర సరిహద్దు ప్రాంతం నుంచి సూర్యా పూర్ అటవీ ప్రాంతంలోకి పులి వచ్చినట్లు పాదముద్రల ద్వారా అటవీ శాఖ అధికారులు గుర్తించారు. పులి జాడకోసం కెమెరా ట్రాప్ లను బిగించారు… అటవీ ప్రాంత శివారు గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పంట పొలాలకు వెళ్లాలంటే రైతులు జంకుతున్నారు.
