Eluru: ఏలూరు జిల్లాలో చిరుత పులి సంచరిస్తుందని వార్త ప్రస్తుతం కలకలం సృష్టిస్తుంది. ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలంలోని ఎం. నాగులపల్లి వద్ద చిరుతపులి సంచరిస్తుందంటూ కొందరు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అక్కడ చేరుకుని విచారణ చేపట్టారు. వారితో పాటు అటవీశాఖ అధికారులు కూడా రంగంలోకి దిగి పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. చిరుతపులి అడుగుజాడలు గుర్తించినట్లు గా కూడా తెలుస్తుంది. చిరుత పులి సంచరిస్తుంది అనే సమాచారంతో సమీప గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. చిరుత కోసం అటవీ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.

